ఇలాంటి పాన్ షాప్ మీరు చూసుండరు? ఒక్కొక్కటి లక్షన్నర మరి!

అదొక పాన్ షాప్.అక్కడ పాన్ తినాలంటే అప్పు చేయాల్సిందే.

దాని పేరు మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్.

ఈ​ షాపులో దాదాపు 600 రకాల పాన్​లు అందుబాటులో ఉంటాయి.

ఈ షాప్​లో 25 రూపాయల పాన్​ నుంచి.లక్షన్నర రూపాయల ధరల వరకు పాన్​లు ప్రతిరోజూ కొలువు దీరతాయి.

ఈ షాప్ మహారాష్ట్రలోని నాశిక్​లో ఉంది.గత ఎనిమిది ఏళ్లుగా ఈ పాన్​ షాపును నిర్వహిస్తున్న గణేశ్​ దుక్రే బీఏ డిగ్రీ పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఉద్యోగ ప్రయత్నాలు చేసి, అదంతా వేస్ట్ అనుకొని తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు.

Advertisement

అనుకున్నదే తడవుగా ఓ పాన్ షాపు ప్రారంభించాలని అనుకొని పుణె వెళ్లి ఓ పాన్​ షాప్​లో కొన్ని రోజులు పనిచేశాడు.అక్కడ వివిధ ఆకులు, పాన్​ల గురించి అవగాహన తెచ్చుకున్నాడు.అనంతరం నాసిక్​ వచ్చి వ్యాపారం ప్రారంభించాడు.

స్టార్ట్ చేసిన కొద్ది రోజులలోనే ఈ పాన్‌హౌస్​కు చాలా మంది అభిమానులు అయిపోయారు.ఎంతలా అంటే నాశిక్​ వచ్చిన పర్యటకులు.

కచ్చితంగా ఈ పాన్ షాపునకు వచ్చి పాన్ తినాల్సిందే.

ఈ నేపథ్యంలో ఓ కస్టమర్ స్పందిస్తూ."చాలా సంవత్సరాలుగా నేను ఈ​ మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్​లో పాన్​ తింటున్నాను.భోజనం చేసిన తరువాత ఇక్కడ పాన్​ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?

ఇక్కడ ఆయుర్వేదిక్​ పాన్​, మిటా పాన్​లు ఉంటాయి.నేను ఈ షాప్​లో ఉన్న చాలా పాన్​లు ట్రై చేశాను.

Advertisement

మీరు కూడా ట్రై చేయండి" అని ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చాడు.ఇక దాని యజమాని అయినటువంటి గణేష్ మాట్లాడుతూ.

"మా దగ్గర మొత్తం 600 రకాల పాన్లు రోజూ అందుబాటులో ఉంటాయి.మగాయి పాన్, గుల్కాడ్​ పాన్​, ఫ్రూట్​ పాన్​, ఐస్​పాన్, జీలీ పాన్, ఐస్​క్రీమ్​ పాన్​ దొరుకుతాయి.లిక్విడ్​ పాన్​ల్లో పాన్​ షేక్​, పాన్​ షాటే, పాన్​ ముజిదే వంటివి ఉన్నాయి.25 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఇక్కడ లభ్యమవుతాయి.అని చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు