ఆచార్య ఈవెంట్ ప్లేస్ చేంజ్.. కన్ఫ్యూజ్ అవుతున్న మెగా ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.

కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.

Advertisement

దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.సినిమాలో యాక్షన్ ఏ లెవల్ లో ఉంటుందో మచ్చుకకు కొన్ని సీన్స్ చూపించాడు కొరటాల.

రామ్ చరణ్ తండ్రి చిరంజీవి తో కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది.ట్రైలర్ తోనే అంత ఉత్సాహం ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు.

అందుకే ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఈ నెల 23న గ్రాండ్ గా జరగనుందని.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఆ ఈవెంట్ కు సీఎం జగన్ మైక్య అతిథిగా వస్తున్నారని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వేడుకను హైదరాబాద్ కు మార్చారని టాక్ వినిపిస్తుంది.

Advertisement

దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పై గందరగోళం నెలకొంది.దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తారో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు