వేణుకి మరో బంపర్ ఆఫర్..!

కమెడియన్ గా ఇన్నాళ్లు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన వేణు ఎల్దండి అలియాస్ వేణు టిల్లు మెగా ఫోన్ పట్టుకుని బలగం అనే సినిమా చేశాడు.దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Venu Yeldandi Another Offer From Dil Raju Details, Balagam, Balagam Movie, Dil R-TeluguStop.com

రిలీజ్ కు ముందే సినిమా ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకోగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సూపర్ అనేశారు.ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంతో వేణు నడిపించిన కథ కథనం ప్రేక్షకులను మెప్పించాయి.

బలగం తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆడియన్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమా హిట్ అవడంతో వేణుకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడట నిర్మాత దిల్ రాజు. బలగం హిట్ టాక్ రావడమే ఆలస్యం వెన సెకండ్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తీసేలా అడ్వాన్స్ ఇచ్చారట.మొత్తానికి దిల్ రాజు మరోసారి తన ప్రొడక్షన్ సత్తా ఏంటో బలగం సినిమాతో చూపించారు.

వేణుకి దిల్ రాజు సెకండ్ ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు.మరి వేణు తన సెకండ్ డైరెక్టోరియల్ సినిమాను ఎలాంటి సినిమాతో మెప్పిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube