వేణుకి మరో బంపర్ ఆఫర్..!

కమెడియన్ గా ఇన్నాళ్లు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన వేణు ఎల్దండి అలియాస్ వేణు టిల్లు మెగా ఫోన్ పట్టుకుని బలగం అనే సినిమా చేశాడు.

దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రిలీజ్ కు ముందే సినిమా ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ తెచ్చుకోగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సూపర్ అనేశారు.

ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంతో వేణు నడిపించిన కథ కథనం ప్రేక్షకులను మెప్పించాయి.బలగం తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆడియన్స్ అంటున్నారు.

"""/" / ఇక ఈ సినిమా హిట్ అవడంతో వేణుకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడట నిర్మాత దిల్ రాజు.

బలగం హిట్ టాక్ రావడమే ఆలస్యం వెన సెకండ్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో తీసేలా అడ్వాన్స్ ఇచ్చారట.

మొత్తానికి దిల్ రాజు మరోసారి తన ప్రొడక్షన్ సత్తా ఏంటో బలగం సినిమాతో చూపించారు.

వేణుకి దిల్ రాజు సెకండ్ ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు.

మరి వేణు తన సెకండ్ డైరెక్టోరియల్ సినిమాను ఎలాంటి సినిమాతో మెప్పిస్తాడో చూడాలి.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?