తిరుపతి లడ్డు వ్యవహారం.. రంగంలోకి దిగిన వేణు స్వామి భార్య.. క్షమాపణలు చెప్పాలంటూ?

తిరుపతి లడ్డు( Tirupathi Laddu ) వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా సంచలనంగా మారింది.

తిరుపతి లడ్డు తయారీలో గత ప్రభుత్వం కల్తీ చేసిందని ఆయన బదులుగా జంతువుల అవశేషాలతో తయారు చేసిన నూనె ఉపయోగించారు అంటూ చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది.

ఇక ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ధర్మాసనం ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించింది.

కోర్టు విచారణలో భాగంగా తిరుపతి లడ్డు విషయంలో నిజాలు నిరూపితం కాలేదని తేలడంతో పలువరు కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక హిందువులకు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి అంటూ సోషల్ మీడియా వేదికగా సరికొత్త హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలోనే ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి( Venu Swamy ) భార్య వీణవాణి( Veena Vani ) సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు.

తిరుపతి లడ్డు వ్యవహారం గురించి ఈమె ఈ వీడియోలో మాట్లాడుతూ.పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారో.భక్తుల మనోభావాలను హింసించారు.

Advertisement

రాజకీయ నాయకులను పక్కన పెడితే ప్రచార కర్తలు పండితులు బ్రాహ్మణులు చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు.ప్రాయశ్చిత్త శ్లోకాలు కనిపెట్టి మరి రచ్చ చేశారు.

వీరి ఓవరాక్షన్ ఆస్కార్ లెవెల్ అని ఈమె తెలిపారు.వీరంతా తమ నటనతో వందల వేల భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మీరు నిజంగానే హిందువులయితే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే క్షమాపణలు చెప్పాలి అంటూ ఈమె డిమాండ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు