బాబాయి అబ్బాయి ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌.. ఎప్పటి నుండో వెయిట్‌ చేస్తున్న సిరీస్‌ రిలీజ్ కు రెడీ

వెంకటేష్ మరియు రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ దగ్గుబాటి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి స్ట్రీమింగ్ అప్డేట్ కోసం అభిమానులు గత ఏడాది నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా కూడా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

 Venkatesh And Rana Web Series Rana Naidu Streeming Update , Rana, Rana Naidu,ven-TeluguStop.com

రానా నాయుడు యొక్క అవుట్ ఫుట్ ఎలా వచ్చిందో అనే అనుమానాలు కూడా ఈ సమయం లో వ్యక్తం అవుతున్నాయి.టీజర్ విడుదలైన తర్వాత స్ట్రీమింగ్ కి ఇంత ఆలస్యం ఏంటో అర్థం కావడం లేదంటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మంచి సమయం చూసి విడుదల చేస్తారేమో అంటూ వెయిట్ చేస్తున్నారు.

మొత్తానికి రానా నాయుడు వెబ్ సిరీస్ ఆసక్తి ని మరింతగా పెంచుతూనే ఉంది.ఎట్టకేలకు వెబ్ సిరీస్ యొక్క స్ట్రీమింగ్ అప్డేట్ ని ఇచ్చేందుకు నెట్ఫ్లిక్స్ సిద్ధమయింది.

Telugu Rana, Venkatesh, Venkateshrana-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమ్మర్ లో ఏప్రిల్ లేదా మే నెల లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సిరీస్ లో వెంకటేష్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.ఈ మధ్య కాలం లో వెంకటేష్ సరైన కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయాడు.దాంతో ఈ వెబ్ సిరీస్ పై అందరి దృష్టి ఉంది.

Telugu Rana, Venkatesh, Venkateshrana-Movie

ఇక రానా చాలా రోజులుగా సినిమాలే చేయడం లేదు.అందుకే ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయితే ఆయన నుండి వరుసగా సినిమాలు వస్తాయేమో అని దగ్గుబాటి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాబాయ్ మరియు అబ్బాయి ఇద్దరికీ కూడా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అత్యంత కీలకంగా మారింది.ఇటీవల విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.తెలుగుతో పాటు ఇతర అన్ని భాషల్లో కూడా ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండబోతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube