వాహనదారులకు షాకిస్తున్న పోలీసులు.. ?

మనిషికి బాధ్యత విలువ అనేది తెలియలేనప్పుడు మాత్రమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు.ఆ నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోడు.

ఇందుకు చక్కని ఉదాహరణ ప్రస్తుతం దేశంలో చెలరేగిపోతున్న కరోనా వైరస్ఈ కోవిడ్ మొదటి సారిగా దేశంలో ప్రవేశించినప్పుడు ప్రజల్లో భయం, అతి జాగ్రత్త ఉండేవి.కానీ ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యం సృష్టంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలో కరోనా వైరస్‌కు స్వేచ్చ దొరికినట్లై విచ్చలవిడిగా వ్యాపిస్తుంది.ఇకపోతే ఇలాంటి ప్రమాదకర పరిస్దితుల్లో కోవిడ్ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు కొందరు.

అందుకే ఈ విషయంలో అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంది.ఇప్పటి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో మాత్రమే చలాన్లు విధిస్తున్న పోలీసులు ఇక నుండి వాహన దారులు మాస్క్ లేకుండా కనిపిస్తే మాత్రం బండి నంబర్‌పై రూ.వెయ్యి ఈ చలాన్‌ పడుతుంది.ఎక్కడైనా పోలీస్‌ చెకింగ్‌లో పట్టుబడితే మాత్రం చలాన్‌ మొత్తం కట్టిన తర్వాతనే బండిని వదిలి పెడుతారు.

Advertisement

ఒకవేళ చలాన్ కట్టడంలో నిర్లక్ష్యం చేస్తే ట్రాఫిక్‌ పోలీసు తనిఖీల్లో దొరికారో అప్పటి వరకు ఉన్న చలాన్ మొత్తం చెల్లించిన తర్వాతనే వాహనాన్ని తిరిగి ఇస్తారు.కాబట్టి మాస్క్ ధరించడం అనేది భాధ్యతగా భావించి కరోనా కట్టడిలో మీ వంతు సహాయం అందించండం మరచిపోకండి.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు