వాల్మీకి కోసం రౌడీ లుక్ లోకి మారిపోయిన వరుణ్ తేజ్!  

వాల్మీకి లుక్ తో భయపెడుతున్న వరుణ్ తేజ్. .

Varun Tej Turned In Rowdy Look For Valmiki Movie-rowdy Look,telugu Cinema,tollywood,valmiki Movie,varun Tej Turned

మహేష్ బాబు తర్వాత టాలీవుడ్ ప్రిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఈ మధ్యకాలంలో మంచి స్పీడ్ మీద ఉన్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకంటే తనదైన ముద్ర వేసే కాన్సెప్ట్ లకి వరుణ్ పెద్ద పీట వేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఫిదా, తొలిప్రేమ, తాజాగా ఎఫ్ 2 తో వరుస విజయాలు అందుకున్నాడు. మధ్యలో అంతరిక్షం లాంటి ఫస్ట్ తెలుగు స్పేస్ మూవీ చేసిన ఘనత కూడా వరుణ్ సొంతం అయ్యింది..

వాల్మీకి కోసం రౌడీ లుక్ లోకి మారిపోయిన వరుణ్ తేజ్!-Varun Tej Turned In Rowdy Look For Valmiki Movie

ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ మరో డిఫరెంట్ రోల్ కి సిద్ధం అవుతున్నాడు. కెరియర్ లో మొదటి సారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో జిగార్తాండ మూవీ రీమేక్ గా తెరకెక్కుతున్న వాల్మీకి లో విలన్ రోల్ ని వరుణ్ పోషిస్తున్నాడు.

ఇందులో విలన్ పాత్ర చుట్టూనే కథ నడవడం వలన వరుణ్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమాకి రెడీ అయ్యాడు ప్రస్తుతం షూటింగ్ మొదలైన ఈ సినిమాలో వరుణ్ లుక్ తాజాగా బయటకి వచ్చింది. చెవికి రింగ్ పెట్టుకొని మాసిన గెడ్డంతో ఉన్న వరుణ్ తేజ్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.