మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ఎఫ్ 2 సినిమా తర్వాత గద్దలకొండ గణేష్ సినిమా తో ఒక మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్నాడు.తప్ప అంతకు మించి విజయాలను దక్కించుకోలేక పోయాడు.
అయినా కూడా వరుసగా సినిమాలు అయితే చేస్తూనే ఉన్నాడు.చాలా ఆశలు పెట్టుకుని చేసిన గని సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.మొత్తానికి వరుణ్ తేజ్ ప్రతి సినిమా కూడా నిరాశ పరుచుతూనే ఉంది.
ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.గత సినిమా లకు ఈ సినిమా లకు ఒక ప్రత్యేకమైన తేడా ఉంది.వరుణ్ తేజ్ పెళ్లి( Varuntej Marriage ) చేసుకోక ముందు వచ్చిన సినిమా లు అవి కాగా.
పెళ్లి తర్వాత రాబోతున్న సినిమా ఇది.కనుక భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల ఫలితాల విషయంలో తారు మారు అవుతోంది.
అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒక వేళ ఈ సినిమా కనుక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లయితే లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) అదృష్టం వల్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి.మొత్తానికి వరుణ్ తేజ్ ఈ సినిమా ఫలితం పై ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఆధారపడి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏం జరుగుతుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆపరేషన్ వాలంటైన్ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.