ఇది మామూలు పెయింటింగ్ కాదు.. అందుకే రూ.1,159 కోట్లకు అమ్ముడుపోయింది..

సాధారణంగా పెయింటింగ్స్ ఎక్కువ ధరకి అమ్ముడుపోతుంటాయి.ఆర్ట్ లవర్స్ కళాఖండాలపై ప్రేమతో ఎంత డబ్బులు వెచ్చించి కొనడానికైనా సిద్ధమవుతారు.

 This Is Not An Ordinary Painting.. That's Why It Was Sold For Rs. 1,159 Crores ,-TeluguStop.com

అయితే తాజాగా ఒక పెయింటింగ్ రికార్డ్ స్థాయిలో రేటు పలికింది.న్యూయార్క్‌లోని సోథెబీస్ వేలంలో ఒక పికాసో పెయింటింగ్( Picasso painting ) 139 మిలియన్ డాలర్లు (రూ.1,159.26 కోట్లు) కంటే ఎక్కువ ధర పలికింది, ఇది ఇప్పటివరకు సేల్ అయిన రెండవ అత్యంత ఖరీదైన పికాసో వర్క్‌గా నిలిచింది.ఈ పెయింటింగ్ పేరు “ఫెమ్మే ఎ లా మాంట్రే” లేదా “వుమన్ విత్ ఎ వాచ్”.

Telugu York, Picasso, Sothebys, Walter, Wristwatch-Latest News - Telugu

ఈ పెయింటింగ్‌లో కళాకారుడి యంగ్ లవర్ మేరీ-థెరిస్ వాల్టర్‌( Marie-Thérèse Walter )బ్లూ కలర్ కుర్చీలో కూర్చొని కనిపిస్తుంది.ఆమె చేతికి చేతి గడియారం ఉంటుంది.ఈ ఆర్ట్ ప్రముఖ ఆర్ట్ కలెక్టర్, దివంగత ఎమిలీ ఫిషర్ లాండౌకు చెందిన ఆర్ట్స్ కలెక్షన్స్ లో ఒక భాగంగా ఉంది.

ఈ పెయింటింగ్‌ను 1932లో చిత్రీకరించారు , ఇది పికాసో కెరీర్‌ను ఒక మలుపు తిప్పింది.ఆ సమయంలో 50 ఏళ్ల వయస్సులో ఉన్న పికాసో అప్పటికే కీర్తి, అదృష్టాన్ని సాధించాడు, కానీ అతని ఇన్నోవేషన్‌ను కొంతమంది విమర్శించారు.

రంగు, రూపం, వ్యక్తీకరణలో అతని నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్భుతమైన పెయింటింగ్‌లు, శిల్పాల రూపొందించడం ద్వారా ఆ విమర్శలకు పికాసో చెక్ పెట్టాడు.ఈ రచనలలో చాలా వరకు వాల్టర్‌ను ప్రదర్శించాడు.

ఆమె పారిస్‌లో పికాసోను 17 ఏళ్ల వయసులో మొదటిసారిగా కలుసుకుంది, ఆపై అతని సీక్రెట్ లవర్ అయింది.దానికి పికాసో అప్పటికే ఓల్గా ఖోఖ్లోవా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

Telugu York, Picasso, Sothebys, Walter, Wristwatch-Latest News - Telugu

వాల్టర్ తన అందంతో పికాసోను ఎంతో ఆకట్టుకుంది.2013లో 155 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిన “లే రెవ్” లేదా “ది డ్రీమ్( THE DREAM )”, 67.5 మిలియన్ డాలర్లకు విక్రయించిన “ఫెమ్మ్ న్యూ కౌచీ” లేదా “న్యూడ్ వుమన్ లైయింగ్ డౌన్” వంటివన్నీ పికాసో సీక్రెట్ లవర్ ను కలిగి ఉన్నాయి.“ఫెమ్మే ఎ లా మాంట్రే”లోని చేతి గడియారం పికాసో ప్రేమ, అతని ఆందోళన రెండింటికి చిహ్నం, అతను తన భార్య, తన లవర్ మధ్య తన సమయాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాడని, ఆ విషయాన్ని ఇలా తెలియజేశారని అంటారు.పెయింటింగ్ 120 మిలియన్ డాలర్లకు సేల్ అవుతుందని అంచనా వేశారు, అయితే ఇది అంచనాలను అధిగమించి 139 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube