మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) క్రేజీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నారు.ఒకవైపు గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమా పూర్తి కాగా ఈ సినిమాను ఇదే నెలలో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందు తీసుకు రానున్నారు.
మరో వైపు మరో రెండు సినిమాలు లైన్లో పెట్టారు.ప్రెజెంట్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాల్లో ”ఆపరేషన్ వాలెంటైన్” సినిమా( Operation Valentine ) ఒకటి.
ఈ సినిమా కూడా భిన్నంగా ఉండనుంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా దేశ భక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాను నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.
భారత వాయుదళ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్( Manushi chhillar ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక పాన్ ఇండియన్ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ అండ్ రెనైస్సేన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇది ఎలాంటి గ్యాప్ లేకుండా షూట్ పూర్తి చేస్తూనే ఇటీవలే మరో సినిమాను ప్రకటించాడు.మట్కా( Matka Movie ) పేరుతొ తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇదే సమయంలో వరుణ్, లావణ్య పెళ్లి( Varun Lavanya Marriage ) కూడా ఉంది.మరి పెళ్లి డిసెంబర్ లో ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ అయ్యాక ఉంటుందని టాక్.పెళ్లి తర్వాత రెండు నెలలు విరామం తీసుకుని అప్పుడు మట్కా సినిమాను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.మొత్తంగా వరుణ్ తేజ్ ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడు.
ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.







