Venu Swamy: ఆ మహిళ వల్లే లావణ్య వరుణ్ తేజ్ విడిపోతారు… మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి?

మెగా కుటుంబంలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవల కాలంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని (Lavanya Tripati) వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీలో నవంబర్ 1వ తేదీ జరిగింది.

ప్రస్తుతం ఈ దంపతులు ఫిన్లాండ్ హనీమూన్ వెకేషన్ లో ఉన్నారు వీరి హనీమూన్ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.ఇక వీరిద్దరూ కలిసి మొదటిసారి మిస్టర్ అనే సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

అప్పటినుంచి వీర ప్రేమ విషయాన్ని రహస్యంగా కొనసాగిస్తూ చివరికి పెద్దల సమక్షంలో ఒకటి అయ్యారు.

ఇలా వీరి వివాహం జరిగినప్పటి నుంచి ఈ దంపతుల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.వివాహ బంధం గురించి మాట్లాడుతూ చేసినటువంటి సంచలనంగా మారాయి.వేణు స్వామి(Venu Swamy) తరచూ సెలబ్రిటీల జాతకాలను అలాగే రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ ఉంటారు.

Advertisement

ఇటీవల కాలంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా నిజమయ్యాయి.దీంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమయ్యింది.

ఇలా వేణు స్వామి తాజాగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జాతకాల గురించి మాట్లాడుతూ వరుణ్ తేజ్ జాతకంలో నాగదోషం( Nagadosham ) ఉందని లావణ్య జాతకంలో కుజదోషం( Kujadosham ) ఉంది అంటూ కామెంట్లు చేశారు.వీరిద్దరి జాతకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వీరిద్దరూ కూడా ఎక్కువ కాలం వైవాహిక జీవితంలో కొనసాగే సూచనలు కనపడటం లేదు అంటూ ఈయన కామెంట్లు చేశారు.వీరిద్దరూ కూడా విడిపోతారని ముఖ్యంగా వీరిద్దరి కుటుంబాలలో ముఖ్య స్త్రీ కారణంగా వీరు విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

జీవితంలో ఎంతో సంతోషంగా ఉండాలని పెద్దలను ఒప్పించి ఆరు సంవత్సరాల పాటు వీరి ప్రేమను గెలిపించుకున్నటువంటి వరుణ్ తేజ్ గురించి ఈ సందర్భంగా వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలపై పలువురు మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శుభమా అంటూ పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఈ దంపతుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ వేణు స్వామి మండిపడుతున్నారు అయితే గతంలో కూడా సమంత( Samantha ) విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సమంత అభిమానులు వేణు స్వామి పై ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ చివరికి ఈయన చెప్పినదే నిజం కావటం విశేషం.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు