ఆ యంగ్ హీరో రీఎంట్రీ... చిరంజీవి హిట్ సాంగ్ టైటిల్ తో

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన కుర్ర నటుడు వరుణ్ సందేశ్.

ఆ సినిమా తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో కొత్త బంగారులోకం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ టాలీవుడ్ మరో యూత్ హీరోగా ఎదుగుతాడని అందరూ భావించారు.

అయితే తరువాత అతను ఎంపిక చేసుకునే సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తనకొచ్చిన ఇమేజ్ ని పూర్తిగా పోగొట్టుకున్నాడు.హ్యాపీ డేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ప్రస్తుతం టాలెంటెడ్ యంగ్ క్రేజీ హీరోగా నిలబడ్డాడు.

డిఫరెంట్ కథలతో సినిమాలు చేసుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటున్నారు.వరుణ్ సందేశ్ తనతో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి వితికని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు.

అతను చివరిగా నువ్వు తోపురా అనే సినిమాలో క్యామియో రోల్ పోషించాడు.అయితే బిగ్ బాస్ సీజన్ 3లో భార్యతో కలిసి వరుణ్ సందేశ్ పాల్గొన్నాడు.

Advertisement

ఈ షోతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.తరువాత మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అయిన అవి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి.అవి స్టార్ట్ అవుతాయో, లేదో కూడా తెలియదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ సందేశ్ తన కొత్త సినిమాకి సంబందించిన టైటిల్ ని ఇన్స్టాగ్రామ్ లో రివీల్ చేశాడు.ఒక మంచి కథతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని చెప్పాడు.

చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ఇందువదన టైటిల్ తో ఈ సినిమా తెరకేక్కుతుందని చెప్పాడు.దీంతో ఏం.ఎస్.ఆర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రాబోతుందని, చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అందులో కమెడియన్ ధనరాజ్ తో సినిమా విషయాలని ముచ్చటించాడు.

Advertisement

తాజా వార్తలు