ప్రముఖ నటి మేనక, సురేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి కీర్తి సురేష్(Keerthy Suresh).ఇలా సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె సౌత్ సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా తెలుగు తమిళ భాషలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.ఇక ఈమె తెలుగులో తమిళ భాషలలో ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించారు.
ఇక త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో కీర్తి సురేష్ గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈమె బాలీవుడ్ సినిమాను ప్రకటించక ముందే వరుణ్ ధావన్ (Varun Dhavan) తో కలిసి ఆటోలో ముంబై వీధులలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా బాలీవుడ్ హీరోతో కలిసి ఈమె ఎంజాయ్ చేయడంతో ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఇకపోతే నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు(Keerthy Suresh Birthday) వేడుకలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా సెలబ్రిటీలు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కీర్తి సురేష్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది ఈమె పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తనకు ఖరీదైన కానుకను అందజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారట.కీర్తి సురేష్ పుట్టినరోజు కావడంతో వరుణ్ ధావన్ కోట్లు విలువ చేసే ప్లాటినం బ్రేస్లెట్( Platinum Bracelet ) తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.ఇలా కోట్లు విలువైన కానుక ఇవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఇద్దరి మధ్య రిలేషన్ లేకపోతే వరుణ్ ధావన్ తనకు అంత ఖరీదైన కానుకలు ఎందుకు ఇస్తారు అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.కీర్తి సురేష్ ఇలా తరచూ ప్రేమ పెళ్లి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ఇదివరకే ఈమె కోలీవుడ్ నటుడు విజయ్ తో( Hero Vijay ) కూడా ప్రేమలో ఉందని ఆయనని పెళ్లి చేసుకోబోతుంది అంటూ కూడా వార్తలు వచ్చాయి.
ఇక కీర్తి సురేష్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో తన తండ్రి సురేష్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తన పెళ్లి గురించి మేము ఏమాత్రం ఆలోచించడం లేదని తన కెరియర్ పై తాను ఫోకస్ పెట్టిందని దయచేసి ఇలాంటి వార్తలను సృష్టించకండి అంటూ కూడా చెప్పుకొచ్చారు.

కీర్తి సురేష్ పెళ్లి ప్రేమ గురించి ఎన్నో రకాల వార్తలో వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు తన తండ్రి కీర్తి సురేష్ ఇద్దరు కూడా ఈ వార్తలను కొట్టి పారేస్తూ వచ్చారు.అయితే తాజాగా ఈమె వరుణ్ ధావన్ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె గురించి మరోసారి ఈ వార్త వైరల్ గా మారింది మహానటి సావిత్రి పాత్రలో నటించి మహానటి లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈమె నిజజీవితంలో కూడా మరో మహానటి( Mahanati ) కాబోతుందా అంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి కీర్తి సురేష్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







