చిన్నపిల్లల్లాగా ఎగురుతూ డాన్స్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వైరల్ వీడియో?

Varalakshmi Sarath Kumar Flying And Dancing Like A Child Viral Video, Varalakshmi Sarath Kumar, Dancing ,Viral Video , Naandhi ,veera Simha Reddy , Tollywood,Krack , Ravi Teja , Veera Simha Reddy

ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు బాగా వినబడుతుంది.లేడీ విలన్ పాత్రకు ఇప్పుడున్న నటులలో ఈమెను మించిన వాళ్లు ఎవరూ లేరని చెప్పాలి.

 Varalakshmi Sarath Kumar Flying And Dancing Like A Child Viral Video, Varalakshm-TeluguStop.com

అతి తక్కువ సమయంలో తన నటనతో ప్రేక్షకులందరిని ఫిదా చేసింది.ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ కూతురే వరలక్ష్మి.

వారసత్వంగా వరలక్ష్మి నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.

గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.

ఇక్కడ కూడా బాగా మార్కులు సంపాదించుకుంది.అంతేకాకుండా ఇటీవలే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.

ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.మొత్తానికి టాలీవుడ్ లో రమ్యకృష్ణ తర్వాత లేడీ విలన్ గా మెప్పించింది అంటే అది వరలక్ష్మి శరత్ కుమార్ అనే చెప్పాలి.

మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ దొరికేసింది అని తెగ సంబరపడిపోతున్నారు.

ఇప్పటివరకు తమిళంలోనే వరలక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఒక వీర సింహారెడ్డి సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగిపోయింది.సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.అయితే తాజాగా తను ఇన్ స్టా వేదికగా ఒక డాన్స్ వీడియో షేర్ చేసుకుంది.అందులో పొట్టి గౌను ధరించి చిన్నపిల్లలాగా డాన్స్ చేస్తూ కనిపించింది.నిజానికి ఆ డ్రస్సులో వరలక్ష్మి శరత్ కుమార్ చాలా క్యూట్ గా ఉంది.ఇక ఆ వీడియో చూసిన తన అభిమానులు బాగా ఫిదా అవుతున్నారు.  లేడి పిల్లలా చెంగు చెంగున ఎగురుతున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తాజాగా ఈమె మైఖేల్ సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా తన పాత్రకు మంచి మార్కులు సంపాదించుకుంటుంది.ఇక ప్రస్తుతం ఈమె పలు ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube