మూడవ సారి పెళ్లికి సిద్దం అయిన మాజీ హీరోయిన్‌

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన విజయకుమార్‌ పెద్ద కూతురు వనిత విజయకుమార్‌ హీరోయిన్‌గా పరిచయం అయ్యి కొన్ని సినిమాలు చేసింది.

కాని ఆమె లక్‌ కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అయ్యింది.

మళ్లీ వెండి తెరపై మెరిసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.తెలుగు తమిళంలో ఆఫర్ల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఆ సమయంలోనే ఈమెకు బిగ్‌బాస్‌ తమిళంలో ఛాన్స్‌ దక్కింది.దాంతో అప్పటి నుండి ఈమె మళ్లీ మీడియాలో నిలుస్తూ వస్తోంది.2000 సంవత్సరంలో సినీ నటుడు ఆకాష్‌ను వివాహం చేసుకున్న వనిత ఆయన నుండి కేవలం అయిదు సంవత్సరాలకే విడిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2007వ సంవత్సరంలో వ్యాపారవేత్త అయిన ఆనంద్‌ను వివాహం చేసుకుంది.

వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది.వీరి సంసారం సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి.

Advertisement

దాంతో ఇద్దరు కూడా అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

ఇక కొన్నాళ్లుగా డాన్సర్‌ రాబర్ట్‌తో ఈమె ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇంతలోనే ఈమె ఈనెల 27వ తారీకున పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పెళ్లి ఆహ్వాన పత్రిక ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది.రాబర్ట్‌తో కూడా ఈమె విడిపోయిందా అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇంత మందితో వ్యవహారం సాగించిన వనిత పీటర్‌తో అయినా కలకాలం జీవితాన్ని సాగించేనా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు