వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాజధాని గాంధీనగర్ మధ్య ఈ రైలు రాకపోకలు కొనసాగుతుంటాయి.
అయితే, ఈ రోజు గుజరాత్ లోని వాత్వా, మణినగర్ స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ కు ప్రమాదం జరిగింది.గేదెల మంద అడ్డురావడంతో లోకో పైలట్ బ్రేక్ వేశారు.
అయినా రైలు వేగం కంట్రోల్ కాకపోవడంతో ఓ గేదెను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వందే ఎక్స్ ప్రెస్ ముందుభాగం దెబ్బతింది.
కాగా, భారతీయ రైల్వేల్లో ఈ ఎక్స్‌ప్రెస్ ను ప్రధాని మోదీ గత వారమే ప్రారంభించారు.







