సల్మాన్ ఖాన్ నుంచి టాలీవుడ్ హీరోల సినిమాలో నటించిన.. బాలీవుడ్ స్టార్స్ వీళ్లే?

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ సినిమాలలో ఒక్కసారి కనిపించిన చాలు అనేంతగా ఆరాటపడేవారు కానీ ఇప్పుడు మాత్రం కాలం మారిపోయింది.టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ ముందు అటు బాలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయి అని చెప్పాలి.

దీంతో బాలీవుడ్ లో స్టార్లుగా కొనసాగుతున్న వారు సైతం అటు టాలీవుడ్లో అడుగుపెట్టి చిన్న పాత్రలు చేసేందుకు కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి.బాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు.

మరి ఇప్పటివరకు తెలుగు హీరోల సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు అజయ్ దేవగన్.

ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు అని చెప్పాలి.ఇక ఇదే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కూడా నటించింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబచ్చన్ మరో కీలకమైన పాత్రలో నటించి మెప్పించాడు.ఈ సినిమా ద్వారా అమితాబచ్చన్ తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గర అయ్యాడు అని చెప్పాలి.తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇక అమితాబచ్చన్ సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించడం సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది అని చెప్పాలి.

ఇక బాలీవుడ్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకుంటున్న ఫారిన్ బ్యూటీ సన్నీలియోన్ కూడా టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంది.మంచు విష్ణు హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది.ఇప్పుడు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్న సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తుంది అని చెప్పాలి.

అంతేకాకుండా మంచి విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో కూడా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్యమైన పాత్రలో నటించాడు అని చెప్పాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు