బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే.ఈ సీరియల్ లో దీప పాత్రలో నటించిన నటి ప్రేమి విశ్వనాథ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
దీప పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈమె వంటలక్కగా మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఈ సీరియల్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న దీప రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవడంతో ఈమెకు ఏకంగా వెండితెర అవకాశాలు కూడా వస్తున్నాయని చెప్పాలి.
ఈ విధంగా ప్రేమి విశ్వనాథ్ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం NC22 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి అధికారికంగా తెలియజేశారు.
ఈ క్రమంలోని ఈ సినిమాలో బుల్లితెరపై వంటలక్కగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం వెల్లడించడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని రోజులపాటు బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేసిన వంటలక్క ఇకపై వెండితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమైందని తెలియడంతో అభిమానులు సంబరపడుతున్నారు.ఇక ఈ సినిమాలో నటుడు సంపత్ రాజ్, అరవింద్ స్వామి, వెన్నెల కిషోర్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.