ఈ ఏడాది వకీల్‌ సాబ్‌ కూడా వచ్చేలా లేడుగా..!

ఈ ఏడాది కరోనా కారణంగా సినిమాలన్నీ ఆగిపోయాయి.

జనవరి ఇంకా ఫిబ్రవరిలో విడుదల అయిన సినిమాలు తప్ప మళ్లీ ఇప్పటి వరకు కొత్త సినిమాల జాడే లేదు.

వచ్చే రెండు నెలల వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.మొన్నటి వరకు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో థియేటర్లు ఓపెన్‌ అవుతాయి.

అప్పుడు మళ్లీ సినిమాల విడుదల జోరు కనిపించే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు ఓపెన్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్‌ అన్ని కూడా ఆగిపోయాయి.ఇటీవలే అనుమతులు రావడంతో మళ్లీ షూటింగ్స్‌ మొదలయ్యాయి.

Advertisement

వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ చివరి దశకు వచ్చింది.ఆ సినిమాను పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఏడాది విడుదల చేసే అవకాశం ఉందని, టాలీవుడ్‌లో ఈ ఏడాది విడుదల కాబోతున్న మరో పెద్ద సినిమా వకీల్‌ సాబ్‌ మాత్రమే అంటూ ప్రచారం జరిగింది.

కాని తాజాగా ఉన్న పరిస్థితులను చూస్తుంటే వకీల్‌ సాబ్‌ కూడా ఈ ఏడాది వచ్చేది అనుమానమే అన్నట్లుగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టులో కరోనా వ్యాక్సిన్‌ వస్తుంది అంటున్నారు.ఒక వేళ కరోనా వ్యాక్సిన్‌ వస్తే ఈ ఏడాది చివరి వరకు సినిమా విడుదల వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ కరోనా ఇదే పరిస్థితిలో విజృంభిస్తే వచ్చే ఏడాది వరకు వకీల్‌ సాబ్‌ కోసం వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పింక్‌ రీమేక్‌గా రూపొందిన వకీల్‌ సాబ్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Advertisement

తాజా వార్తలు