ఆరు నూరైనా వకీల్ సాబ్ వచ్చేది అప్పుడేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక కొంతమేర షూటంగ్ మిగిలి ఉండటంతో ఈ సినిమాను త్వరలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఇప్పట్లో పాల్గొనడని, దీంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యమై రిలీజ్ కూడా ఆలస్యం అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు.కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

Advertisement

వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి చాలా తక్కువ భాగమే షూటింగ్ మిగిలి ఉండటంతో, కేవలం కొద్ది సమయంలోనే ఈ షూటింగ్‌ను ముగించేసి దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటే దసరా నాటికి ఈ సినిమా రిలీజ్‌కు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరి ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

వీడియో వైరల్‌ : ఇదేందయ్యా ఇది.. బస్సుపై కాకులు టూర్ ప్లాన్ చేశాయా ఏంటి..?
Advertisement

తాజా వార్తలు