సురేష్ కొండేటికి భారీ షాకిచ్చిన వైష్ణవి చైతన్య.. ముద్దు పెడతానంటే చెప్పు తెగుతుందంటూ?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య( Anand Devarakonda, Vaishnavi Chaitanya ) కాంబినేషన్ లో తెరకెక్కిన బేబి మూవీ ( Baby movie )జులై నెల 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.బేబి ట్రైలర్ కు ఇప్పటివరకు 3.

9 మిలియన్ వ్యూస్ రాగా ఈ వ్యూస్ అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ సినిమా చిన్న సినిమాలలో పెద్ద హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యకమవుతున్నాయి.

ఆనంద్ దేవరకొండకు ఈ సినిమాకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ మధ్య కాలంలో వివాదాస్పద ప్రశ్నలు, కామెంట్ల ద్వారా పాపులర్ అయిన సురేష్ కొండేటి( Suresh Kondeti ) బేబి టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా సురేష్ కొండేటి వైష్ణవి చైతన్యతో ముద్దు పెట్టుకుంటా అని అన్నారు.వైష్ణవికి అర్థం కాక విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా ఆ తర్వాత సురేష్ కొండేటి "ఈ మూవీలో హీరో అడిగిన ప్రశ్న ముద్దు పెట్టుకుంటా అన్నాడు.

Advertisement

దానికి మీ రియాక్షన్ ఏంటి" అని అడగగా చెప్పు తెగుద్ది అని వైష్ణవి చైతన్య బదులిచ్చారు.

సురేష్ కొండేటి వెంటనే ఓహో.చెప్పు తెగుద్దా అంటూ కామెంట్ చేయడం గమనార్హం.సురేష్ కొండేటి కావాలనే ఈ తరహా ప్రశ్నలు అడుగుతున్నారా? లేక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయా అనే కామెంట్లకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.సురేష్ కొండేటి పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్( producer, distributor ) గా వ్యవహరించడం గమనార్హం.

బేబి మూవీ ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ప్రత్యేకంగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ జనరేషన్ కు అనుగుణంగా నిజ జీవితంలో జరుగుతున్న ఘటనలను ఈ సినిమాలో చూపిస్తున్నామని వైష్ణవి చైతన్య అన్నారు.ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు