వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల 'ఆదికేశవ' ప్రివ్యూ

మెగా ఫ్యామిలీ నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్( Vaishnav Tej ) మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లు దక్కించుకోవడం తో చిరు, పవన్‌ లకు తగ్గ అల్లుడు అంటూనే, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయి లో మెగా ఫ్యామిలీ నుంచి హీరో వచ్చాడు అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ సంతోషించారు.కానీ వారి సంతోషం మూడు నాళ్ల ముచ్చటగానే నిలిచి పోయింది.

 Vaishnav Tej Aadi Keshava Movie Preview , Vaishnav Tej , Aadi Keshava , Tolly-TeluguStop.com

వైష్ణవ్‌ తేజ్ నుంచి వచ్చిన రెండో సినిమా కొండ పొలం సినిమా నిరాశ పరిచింది.ఆ తర్వాత వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా డిజాస్టర్‌ గా నిలిచింది.

దాంతో ఆదికేశవ( Aadi Keshava ) సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రీ లీల నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంతే కాకుండా భారీ ఎత్తున ఈ సినిమా కి సితార ఎంటర్ టైన్మెంట్స్( Sithara Entertainments ) వారు ఖర్చు చేసి మరీ నిర్మించారు.అందుకే ఈ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటున్నారు.

మొత్తానికి ఈ సినిమా యొక్క విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు సమీపించింది.రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కు పెద్దగా బాక్సాఫీస్‌ వద్ద పోటీ లేదు.

శ్రీకాంత్‌ రెడ్డి ఎన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను నాగ వంశీ( Naga Vamsi ) నిర్మించాడు.ఈ సినిమా కథ మరియు స్క్రిప్ట్‌ విషయం లో త్రివిక్రమ్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందట.అందుకే ఈ సినిమా కచ్చితంగా బాగుంటుంది అంటూ మేకర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు అంతా కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.ఈ సినిమా కి వచ్చిన పాజిటివ్‌ బజ్‌ నేపథ్యం లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది అనేది రేపు విడుదల అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube