దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకు వస్తున్న క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆరోపించారు.సికింద్రాబాదుకు చెందిన హైదరాబాద్ రంజీ ప్లేయర్ భోగి శ్రావణిని తన నివాసంలో సన్మానించారు.
ఇటీవల సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట తుకారంగేటు వద్ద ఉన్న భోగి శ్రావణి ఇంటిని జిహెచ్ఎంసి అధికారులు పడగొట్టారు.
ఏ మాత్రం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పాత కన్స్ట్రక్షన్ కూల్చేస్తూన్నామని కేవలం భోగి శ్రావని ఇంటిని మాత్రమే అధికారులు సరైన చర్య కాదని హనుమంత రావు విమర్శించారు.
సీఎం కేసీఆర్ క్రీడాకారులను ప్రోత్సహించాలి తప్ప నిరాశకు గురి చేయవద్దని తక్షణమే భోగి శ్రావణికి నూతన గృహాన్ని నిర్మించి ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ లకు సూచించారు.లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వి.హనుమంతరావు హెచ్చరించారు.
.