చరిత్రలో రెండవ సారి మూతపడనున్న కాశీ విశ్వనాథ్ ఆలయం.. ఎందుకంటే?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి.ఇలాంటి వాటిలో వారణాసిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం ఒకటని చెప్పవచ్చు.

ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఎన్నో శివాలయాలు పెద్దఎత్తున భక్తులతో, శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.ఇలా శివాలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉండగా వారణాసిలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మూతపడనుంది.

ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో స్వామివారి ఆలయం మూత పడటానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

సాధారణంగా ఎన్నో ఆలయాలు పునరుద్ధరణ జరుపుకుంటూ ఉంటాయి.ఇలా పునరుద్ధరణలో భాగంగా శ్రీ కాశి విశ్వేశ్వర స్వామీ ఆలయం మూడు రోజులపాటు మూసివేయనున్నారు ఈ క్రమంలోనే నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి లేకుండా ఆలయాన్ని మూసివేయనున్నారు.అయితే చరిత్రలో ఈ విధంగా స్వామివారి ఆలయాన్ని మూసివేయడం ఇది రెండవ సారి అని చెప్పవచ్చు.

Advertisement

మొట్టమొదటిసారిగా భక్తులకు స్వామివారి దర్శనం లేకుండా కరోనా కారణం వల్ల ఆలయాన్ని మూసివేశారు.అలాగే ప్రస్తుతం ఆలయ పునరుద్ధరణ పనులు జరుపుకోవడం వల్ల మూడు రోజులపాటు ఆలయాన్ని మూసివేయడంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం చరిత్రలో రెండోసారి స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి లేకుండా మూసివేయడం జరుగుతుంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు