ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు.ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కుంగిపోతుండటం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జోషిమఠ్ ప్రభావిత కుటంబాలకు ఇవాళ్టి సాయంత్రం కల్లా పరిహారం అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు.జోషిమఠ్ లో కేవలం 25 శాతం ఇళ్లలో మాత్రమే పగుళ్లు సంభవించాయని వెల్లడించారు.
అదేవిధంగా ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్యలు ఉందేమో అన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.దానిని బట్టి తదుపరి నిర్ణయాలుంటాయని చెప్పారు.
అంతకుముందు జోషిమఠ్ లో స్వయంగా పర్యటించిన సీఎం అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు.కాగా జోషిమఠ్ లో గత కొన్నేళ్లుగా భూమి కుంగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
ప్రకృతి వైపరీత్యాలకు తోడు మానవ తప్పిదాలు కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది.







