కరోనా ఎందరినో పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.ఒకపక్క భారతీయ జనతా పార్టీ బీహార్ లో భారీ విజయం సాధించడం తో సంబరాలు చేసుకుంటుండగా, మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యే మృతి చెందడం విషాదం నింపింది.
కరోనా మహమ్మారికి సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల మరణాలు కూడా కొనసాగుతున్నాయి.తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూసినట్లు తెలుస్తుంది.
సాల్ట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రెండు వారాల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించింది.
దీనితో ఆయనను కొన్ని రోజుల కింద ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా బుధవారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించంచడతో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తుంది.సురేంద్ర జీవా కు బీజేపీ పార్టీ లో మంచి పేరుంది.1969 డిసెంబర్ 8న అల్మోరా జిల్లాలోని సాదిగావ్‌లో జన్మించిన ఆయన ఉత్తరాఖండ్‌లో వెరటన్ యూత్ లీడర్‌గా మంచి పేరుతెచ్చుకున్నారు.2007 లో మొదటిసారిగా జీనా ఉత్తరాఖండ్ లోని బిక్యాసెన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా విజయం సాధించగా, ఆ తరువాత సాల్ట్ నియోజకవర్గం నుంచి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

దీనితో ఆయన ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు తెలుస్తుంది.కొద్దిరోజుల క్రితమే ఆయన భార్య గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు తాజాగా ఆయన మృతి చెందడం తో ఆయన నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది.భార్య,భర్త లు ఇద్దరూ కొద్దీ రోజుల తేడా తో మృతి చెందడం ఆయన కుటుంబ సభ్యులను కూడా శోకసంద్రంలో ముంచేసింది.మరోపక్క ఉత్తరాఖండ్ లో కీలక నేతను కోల్పోవడం తో పార్టీ నేతలు,కార్యకర్తలు శోకసంద్రంలో మునిగారు.