ఉత్తమ్ కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి..: ఎమ్మెల్యే శానంపూడి

కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

ఈ మేరకు ఉత్తమ్ కుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

ఓడిపోతాననే భయం ఉత్తమ్ కుమార్ కు పట్టుకుందని ఎమ్మెల్యే శానంపూడి అన్నారు.అలాగే ఉత్తమ్ కుమార్ లా ప్యాకేజీ రాజకీయాలు చేయడం తనకు చేతకాదని చెప్పారు.

ఈ క్రమంలోనే ఉత్తమ్ ఎంత రెచ్చగొట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.ఉత్తమ్ కోసం పనిచేసే ఏజెన్సీ వాళ్లు తమ దగ్గర పని చేస్తున్నారన్న ఆయన ఉత్తమ్ తో చేతులు కలిపి గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

అయితే ఆ విషయం తనకు నిన్నటి వరకు తెలియదని చెప్పారు.సదరు ఏజెన్సీ సంస్థ ఇరువురికి పని చేయడం అనైతికమని పేర్కొన్నారు.

Advertisement

ఈ క్రమంలో ఏజెన్సీపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు