పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.
అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ పరంగా బిజీ అవ్వడంతో ఈయన క్రేజీ ప్రాజెక్టులు అన్ని కూడా వాయిదా పడాల్సి వచ్చింది.మళ్ళీ ఇటీవలే డేట్స్ కేటాయించడంతో షూటింగులు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి.ఉస్తాద్( Ustad ) కూడా ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయినట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈ మధ్యనే అఖిల్ ఏజెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సాక్షి వైద్య ( Sakhi Vaidya )అన్నట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.ఈ అమ్మడు హీరోయిన్ గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని చెబుతున్నారు.
ఈ ఏజెంట్ భామ ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున సినిమా కూడా చేసింది.ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.
మరి ఈ సినిమా అయినా అమ్మడికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.ఇక మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.