‘ఉస్తాద్’లో మరో యంగ్ హీరోయిన్.. ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.

ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇటీవలే ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

"""/" / అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ పరంగా బిజీ అవ్వడంతో ఈయన క్రేజీ ప్రాజెక్టులు అన్ని కూడా వాయిదా పడాల్సి వచ్చింది.

మళ్ళీ ఇటీవలే డేట్స్ కేటాయించడంతో షూటింగులు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి.ఉస్తాద్( Ustad ) కూడా ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయినట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది.

"""/" / ఈ సినిమాలో ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈ మధ్యనే అఖిల్ ఏజెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సాక్షి వైద్య ( Sakhi Vaidya )అన్నట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.

ఈ అమ్మడు హీరోయిన్ గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని చెబుతున్నారు.ఈ ఏజెంట్ భామ ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున సినిమా కూడా చేసింది.

ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా అయినా అమ్మడికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

ఇక మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఏందయ్యా ఇది.. ఉద్యోగులను, బాస్‌లను అమ్మేస్తున్న చైనీస్ ఎంప్లాయిస్..?