ఈ హోమ్ మేడ్ టూత్ పేస్ట్ ను వాడితే మీ దంతాలు వైట్ గా మరియు సూపర్ షైనీ గా మెరుస్తాయి!

దంతాలు( teeth ).తెల్లగా మరియు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటే నవ్వుతున్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మరింత అందంగా కనిపిస్తారు.

అందుకే అటువంటి దంతాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ దంత సంరక్షణ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, గుట్కా, పాన్ మసాలా వంటివి తరచూ తీసుకోవడం తదితర కారణాల వల్ల దంతాలు రంగు మారిపోతుంటాయి.

ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో అంత చురుగ్గా మాట్లాడలేరు.నలుగురిలో నవ్వేందుకు కూడా కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టూత్ పేస్ట్( Homemade toothpaste ) అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement
Using This Homemade Toothpaste Will Make Your Teeth Whiter And Super Shiny! Home

ఈ టూత్ పేస్ట్ ను వాడితే మీ దంతాలు కొద్ది రోజుల్లోనే వైట్ గా మరియు సూపర్ షైనీ గా మెరుస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం దంతాలను మెరిపించే ఆ టూత్ పేస్ట్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు అంగుళాల దాల్చిన చెక్కను( Cinnamon ) చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి.

Using This Homemade Toothpaste Will Make Your Teeth Whiter And Super Shiny Home

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు( Pepper ), హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ) వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ ములేటి పొడి( Muleti powder ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని టూత్ పేస్ట్ లా ఉపయోగించి దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు బ్రష్ తో శుభ్రంగా తోముకోవాలి.

Using This Homemade Toothpaste Will Make Your Teeth Whiter And Super Shiny Home
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఆపై వాటర్ తో దంతాలు మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ హోమ్ మేడ్ టూత్ పేస్ట్ ను రెగ్యులర్ గా వాడితే దంతాలు కొద్ది రోజుల్లోనే తెల్లగా ముత్యాల మాదిరి మెరుస్తాయి.అలాగే సూపర్ షైనీ గా మారతాయి.

Advertisement

అంతేకాదు ఈ టూత్ పేస్ట్ ను వాడ‌టం వల్ల చిగుళ్ల వాపులు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి సమస్యలు త‌గ్గు ముఖం పడతాయి.దంతాలు చిగుళ్ళు దృఢంగా మారతాయి.

తాజా వార్తలు