Thick Hair Magical Oil : ఈ మ్యాజికల్ ఆయిల్ ను వారంలో 2 సార్లు వాడితే ఒత్తైన జుట్టు మీ సొంతం!

ఒత్తైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.స్త్రీలు అయినా పురుషులు అయినా ఒత్తైన జుట్టు కోసం తెగ ఆరాటపడుతుంటారు.

 Use This Magical Oil 2 Times A Week For Thick Hair, Magical Oil, Thick Hair, Oil-TeluguStop.com

కానీ ఏదో ఒక కారణం చేత జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.దాంతో కురులు పల్చగా మారిపోతాయి.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను వారంలో కేవలం రెండు సార్లు కనుక వాడితే హెయిర్ ఫాల్ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.అదే సమయంలో ఒత్తైన జుట్టును తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి విత్తనాలు, రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వకముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న కలోంజి నువ్వుల పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Care, Care Tips, Fall, Magical Oil, Thick, Thin-Telugu Health Tips

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార పెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని ఒక బాటిల్ లో నింపుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కనీసం ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Magical Oil, Thick, Thin-Telugu Health Tips

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూను యూస్ చేసి తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ ఫాల్ క్రమంగా అదుపులోకి వస్తుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరగడం ప్రారంభం అవుతుంది.

కాబట్టి ఒత్తైన జుట్టు కోసం ఆరాటపడేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube