విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ నివాసం ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అవినాష్ ఇంట్లో ఐటీ నిర్వహిస్తున్న దాడులను నిరసిస్తూ వైసీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.
ఇందులో భాగంగా జై అవినాష అంటూ భారీగా ఎత్తున నినాదాలు చేశారు.వైసీపీ శ్రేణుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దేవినేని నెహ్రూ ఫ్యామిలీ పేరు చెడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే దేవినేని అవినాష్ నివాసంలో ఉదయం 6.30 గంటల నుంచి ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.