కన్నబిడ్డలను దత్తతకు ఇచ్చిన యూఎస్ మహిళ.. కారణం తెలిస్తే షాకే..

సాధారణంగా తల్లులు తమ కన్న పేగు బంధాన్ని తెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు.కష్టమైనా పిల్లలను పెంచి పోషిస్తారు.

తమ సౌకర్యాలను త్యాగం చేసి వారిని ఒక స్థాయికి తీసుకొస్తారు కానీ ఒక అమెరికా మహిళ మాత్రం తన ఇద్దరు కన్న బిడ్డలను ఒక సిల్లీ రీజన్‌తో దత్తతకు( Adoption ) ఇచ్చేసింది.పెన్సిల్వేనియాకి చెందిన ఈ తల్లి పేరు హన్నా మార్టిన్.

( Hannah Martin ) వయసు 32 ఏళ్లు.ఆమె తన ఇద్దరు పిల్లలను దత్తతకు ఇచ్చిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తన ఆర్థిక పరిస్థితి( Financial Hardship ) బాగా లేకపోవడంతో ఈ కష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.కానీ చాలామంది చేతిలో చిల్లి గవ్వ లేని తల్లులు కూడా అతని పిల్లల్ని పెంచుకుంటున్నారు అని అంటున్నారు.

Advertisement

మరికొంతమంది ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

హన్నాకు మొత్తం ఐదుగురు పిల్లలు.ఆమెకు 19 ఏళ్ల వయసులోనే మొదటి పాప అయిన అడ్రియానా జన్మించింది.కానీ అడ్రియానాకు కేవలం ఒక నెలన్నర వయసు ఉండగానే ఆమె బాయ్‌ఫ్రెండ్ బిడ్డకు తాను తండ్రి కాదని తిరస్కరించాడు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న హన్నా, 2011లో అడ్రియానాను( Adriana ) దత్తతకు ఇచ్చే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.ఒక లాయర్ సహాయంతో ఆమె అడ్రియానాను దత్తత తీసుకునేందుకు ఒక కపుల్‌ను కనుగొంది.

2011లో తన మొదటి పాప అడ్రియానాను దత్తతకు ఇచ్చిన హన్నా మార్టిన్, రెండేళ్ల తర్వాత 2013లో టైలర్‌( Tyler ) అనే కుమారునికి జన్మనిచ్చింది.అయితే, టైలర్‌ను కూడా పెంచడానికి తనకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో, మరో కుటుంబానికి దత్తతకు ఇవ్వడానికి నిర్ణయించుకుంది."ఒక పిల్లని దత్తతకు ఇవ్వడం చాలా బాధాకరం.

కన్నప్ప లో ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడు..?
భారత సంతతి వ్యక్తికి కీలక పదవి .. ట్రంప్ ప్రకటన, ఎవరీ జై భట్టాచార్య?

ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మనసులను కలచివేసే సంఘటన.కానీ, మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నామనే అనుభూతి కూడా కలుగుతుంది," అని హన్నా తన అనుభవాన్ని పంచుకుంది.

Advertisement

ప్రస్తుతం హన్నా మార్టిన్ తన మిగతా ఇద్దరు కొడుకులు, ఒక కూతురును ఒంటరిగా పెంచుతోంది.తన దత్తతకు ఇచ్చిన పిల్లలను చూడాలని ఆమె ఎంతో కోరుకుంటున్నప్పటికీ, వారి ఫోటోలు కూడా ఆమె వద్ద లేవు.

ఈ పరిస్థితి ఆమెకు ఎంతో బాధ కలిగించినప్పటికీ, తన పిల్లల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె నమ్ముతోంది.

తాజా వార్తలు