అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం: వింటర్‌, ఫెస్టివల్ మూడ్‌లో జనం, రాబోయేది గడ్డు కాలమేనా..?

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగానే భయపెడుతోంది.ఇప్పటికే ఎన్నో దేశాల్లోకి  అడుగుపెట్టిన ఈ మహమ్మారి ప్రాణాలు తీయడం మొదలెట్టింది.

 Us Reports First Death Believed Related To Omicron Variant , Omicron Variant, Br-TeluguStop.com

ముఖ్యంగా బ్రిటన్‌ను హడలెత్తిస్తోంది.ఒమిక్రాన్ పుట్టినిల్లు అయిన సౌతాఫ్రికా కంటే ఎక్కువగా యూకేలోనే కేసులు నమోదవుతుండగా.

మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.కొత్త వేరియంట్‌ కారణంగా బ్రిటన్‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక సోమవారం నాడు కొత్తగా 90 వేలకి పైగా కోవిడ్ కేసులు వెలుగుచూస్తే.అందులో 12 వేలు ఒమిక్రాన్ కేసులే కావడాన్ని బట్టి పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

దీంతో వైరస్ కట్టడికి మరోసారి లాక్‌డౌన్ విధించాలని బ్రిటన్ సర్కార్ భావిస్తోంది.

ఇటు అమెరికాలోనూ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది.

టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఈ వేరియంట్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.అయితే దీనిని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది.బ్రిటన్ తర్వాత అమెరికాలోనూ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది.న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లో దీని తీవ్రత అధికంగా వుందని సీడీసీ తెలిపింది.థ్యాంక్స్ గివింగ్ జరిగిన నాటి నుంచి దేశంలో కరోనా కేసులు మళ్లీ తిరగబడుతున్నట్లుగా అభిప్రాయపడింది.వింటర్ సీజన్ ప్రారంభమవ్వడం, ఈ వారం క్రిస్మస్ పర్వదినం కూడా వుండటంతో ఒమిక్రాన్ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలోనే బూస్టర్ డోస్‌ పంపిణీపై అమెరికా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

మరోవైపు ఒమిక్రాన్ పట్ల ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధ్య‌క్షుడు జో బైడెన్ హెచ్చరించారు.

ఇప్ప‌టివ‌ర‌కూ కనీసం ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోని వారికి ముప్పు తప్పదని ఆయన తెలిపారు.శీతాకాలంలో మర‌ణాలు, తీవ్ర అస్వ‌స్ధ‌తతో ఆస్ప‌త్రుల బారిన‌ప‌డే వారి సంఖ్య పెరిగే అవకాశం వుందని జో బైడెన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టికే టీకా తీసుకుంటే త‌క్ష‌ణ‌మే బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌ని.అసలు వ్యాక్సిన్ తీసుకోకుంటే వెంటనే తొలి డోసు తీసుకోవాల‌ని జో బైడెన్ కోరారు.

అప్పుడే మ‌ర‌ణాలు, తీవ్ర అస్వ‌స్ధ‌త ముప్పు త‌ప్పుతుంద‌ని ఆయన హితవు పలికారు.ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని ప్ర‌జ‌లు వెంట‌నే బూస్ట‌ర్ డోసు తీసుకోవ‌డం కీల‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

US reports first death believed related to Omicron

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube