US Presidential Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ముగిసిన సూపర్‌ ట్యూస్‌డే .. నిక్కీ హేలీ తప్పుకుంటారా, కొనసాగుతారా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ( Nikki Haley ) తనకు ఓడిపోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు.

సూపర్‌ ట్యూస్డే ప్రైమరీలలో వెర్మోంట్‌ను కైవసం చేసుకోవడం ద్వారా మొత్తం 15 రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే ట్రంప్ కలలపై హేలీ నీళ్లు చల్లారు.

అయితే ఆమె తన భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.వరుస పరాజయాల తర్వాత వెంటనే వైదొలిగే ఉద్దేశం హేలీకి లేదని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

సౌత్ కరోలినాలోని తన నివాసంలో గడిపారు నిక్కీ హేలీ.తన పిల్లలు, భర్త మైఖేల్ హేలీ సహా తన కుటుంబంతో నిక్కీ హేలీ భవిష్యత్తు ప్రణాళికలను చర్చిస్తారని ఆమె మాజీ సహాయకుడు రాబ్ గ్రాడ్ ఫ్రే చెప్పారు.

2017లో ట్రంప్( Donald Trump ) పరిపాలనలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన నిక్కీ హేలీ .ట్రంప్, జో బైడెన్ కాకుండా అమెరికన్లకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తానని చెప్పారు.వీరిద్దరూ దేశానికి హానికరమని ఆమె పేర్కొన్నారు.

Advertisement

రిపబ్లికన్ నేత.హౌస్ మాజీ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ( Former Republican House Speaker Kevin McCarthy ) మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని అందుకోలేకపోయినా.జీవోపీలో భవిష్యత్తులో నిక్కీ కీలకపాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.

నిక్కీ హేలీకి ఉజ్వల భవిష్యత్తు వుందని మెక్‌కార్తీ అన్నారు.సూపర్ ట్యూస్‌డే( Super Tuesday ) తర్వాత హేలీ తన క్యాలెండర్‌లో ఇప్పటి వరకు ఎలాంటి పబ్లిక్ అప్పియరెన్స్‌ను ప్లాన్ చేయలేదు.

రేసు నుంచి తప్పుకోవాలని ట్రంప్‌ను ఎండార్స్ చేయాలంటూ కాల్స్ వస్తున్న దశలో నిక్కీ హేలీ సూపర్ ట్యూస్‌డే వీక్‌లోకి ప్రవేశించారు.ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.

తాను సంతకం చేసిన రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ) ప్రతిజ్ఞకు బాధ్యత వహించడం లేదన్నారు.దీని ప్రకారం.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!

తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే జీవోపీ నామినీకి మద్ధతు ఇస్తానని వాగ్ధానం చేశారు.

Advertisement

ట్రంప్ కేబినెట్‌లో భాగమయ్యే అవకాశాలు కానీ ఆయన సహచరురాలిగా హేలీ వుండే పరిస్ధితులు కనిపించడం లేదు.తాను వైస్ ప్రెసిడెంట్‌గా వుండటానికి ప్రయత్నించడం లేదని రిచ్‌మండ్‌( Richmond )లో ప్రసంగిస్తూ హేలీ వ్యాఖ్యానించారు.ట్రంప్ హయాంలో రిపబ్లికన్ పార్టీ ప్రాబల్యం కోల్పోతుందని, ఆయన నామినేషన్ అమెరికాకు వినాశకరమైనదిగా హేలీ వాదించారు.

హేలీ తన ప్రచారాన్ని కొనసాగిస్తారని, ఆమె సంపాదించిన రాజకీయ మూలధనాన్ని , తన భవిష్యత్తుకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయోగించుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.సూపర్ ట్యూస్‌డే తర్వాత 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని విరమించుకున్న మిట్ రోమ్నీ అడుగుజాడలలో నిక్కీ హేలీ నడుస్తారని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు