దీపావళి వేడుకలకు సిద్ధమవుతోన్న అమెరికా అగ్రనేతలు.. వైట్‌హౌస్‌లో బైడెన్, ఫ్లోరిడా రిసార్ట్స్‌లో ట్రంప్

భారతీయుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.

దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.

ఇప్పుడు ఇది సర్వజన ఆనందకేళిగా మారిపోయింది.భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు.దీపావళి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు.

Advertisement

తద్వారా మనదేశంలో జరుపుకునే రోజే దాదాపు అన్ని దేశాల వారు దీవాళీని జరుపుకుంటున్నారు.ఇక మనకు మరో ఇల్లుగా మారిన అమెరికా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏకంగా అగ్రరాజ్యాధినేత కొలువుండే వైట్‌హౌస్‌లోనే దీపావళీ వేడుకలు జరుగుతాయి.మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ శ్వేతసౌధంలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు.

అలాగే 2016లో దీవాళీకి తపాలా బిళ్ళను కూడా అమెరికా విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది.

అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.అక్టోబర్ 24న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ దంపతులు దీపావళి వేడుకల్లో పాల్గొంటారని అధికార ప్రతినిధి జీన్ పియరీ మీడియాకు తెలిపారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

భారతదేశం, ప్రవాస భారతీయులతో అమెరికాకు వున్న అనుబంధం నేపథ్యంలో దీపావళి వేడుకలను జరుపుకునేందుకు బైడెన్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పియరీ తెలిపారు.ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా వేడుకలకు హాజరవుతారని సమాచారం.

Advertisement

ఇకపోతే.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అక్టోబర్ 21న ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగ్ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటి నేతలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటారని రిపబ్లికన్ హిందూ కూటమ (ఆర్‌హెచ్‌సీ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.నాలుగు గంటల పాటు వేడుకలు జరుగుతాయని.

ఆరోజున బాణాసంచా కాల్చడానికి గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఆర్‌హెచ్‌సీ నేత శలభ్ కుమార్ పేర్కొన్నారు.

తాజా వార్తలు