ఆకాశంలో రెపరెపలాడిన ఎన్టీఆర్ ఎయిర్ ప్లేన్ బ్యానర్.. వీడియో వైరల్!

US NTR Fans Thank The RRR Actor In A Unique Way Details, RRR, NTR, US Fans, Ntr Airplane Banner, Us Ntr Fans , Ntr30 Movie, Director Koratala Siva, Rrr Oscar, Janhvi Kapoor,

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాతో పాన్ ఇండియన్ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడంతో ఈయన పేరు మరింత మారుమోగి పోతుంది.

 Us Ntr Fans Thank The Rrr Actor In A Unique Way Details, Rrr, Ntr, Us Fans, Ntr-TeluguStop.com

ఆస్కార్ అందుకుని రెండు రోజుల క్రితమే హైదరాబాద్ లో అడుగు పెట్టాడు.వచ్చి రాగానే ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.

ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుని హాలీవుడ్ ఫ్యాన్స్ ను సైతం మెప్పించారు.మరి ఎన్టీఆర్ యుఎస్ ఫ్యాన్స్ ఈయనకు సరికొత్త రీతిలో థాంక్స్ తెలిపారు.

వినూత్న పద్ధతిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఈ పని నెట్టింట వైరల్ అవుతుంది.ప్రపంచ సినిమా గుండెపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎయిర్ ప్లేన్ బ్యానర్ ఆకాశంలో రెపరెప లాడింది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.”థాంక్యూ ఎన్టీఆర్.ఎన్టీఆర్30 కోసం ఎదురు చూడలేం” అంటూ యూఎస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై తమకు ఉన్న ప్రేమను వెల్లడించారు.ఈ వీడియోను ఎన్టీఆర్ యూఎస్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఏప్రిల్ 5, 2024న సిటీకి ఎరుపు రంగు వేద్దాం అంటూ తెలిపారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 30వ (NTR30) సినిమా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న విషయం విదితమే.

ఈ సినిమాను ఈ నెల 23న గ్రాండ్ గా లాంఛ్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అలాగే విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పేరు ఫైనల్ అయినట్టు టాక్.

యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube