ప్రతి విషయాన్ని ఖండించే నాగబాబు కూతురు విషయంలో ఎందుకీ మౌనం?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇకపోతే మెగా డాటర్ నిహారిక(Niharika) గురించి,ఆమె విడాకుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Why Silence About Nagababu Daughter Who Denies Everything ,megafamily ,naga Babu-TeluguStop.com

ఈమెకు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య(Venkata Chaitanya) అనే వ్యక్తితో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేశారు.ఇలా వీద్దరు ఎంతో సంతోషంగా ఉండగా తాజాగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక చైతన్య కూడా నీహారికకు ఇన్స్టాగ్రామ్ లో కూడా అన్ ఫాలో చేశారు.అదే విధంగా వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేశారు.

ఇలా వెంకట చైతన్య ఫోటోలను డిలీట్ చేయటంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే విడిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇక వీరి విడాకులకు(Divorce) కారణం నిహారిక పబ్ లో పోలీసులకు దొరికిపోవడం వల్ల ఈ విషయం గురించి మనస్పర్ధలు వచ్చాయని అందుకే వీరి వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా మెగా డాటర్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరుకు ఈ విషయం పై మెగా ఫ్యామిలీ(Megafamily) లేదా చైతన్య ఫ్యామిలీ కూడా స్పందించలేదు.

ఇకపోతే మెగా కుటుంబం గురించి ఏ ఒక్కరు చిన్న మాట అన్నా కూడా స్పందించి వారికి తన స్టైల్ లో సమాధానం చెప్పే నాగబాబు(Naga Babu) తన గారాల పట్టి నిహారిక గురించి ఇలాంటి వార్తలు వస్తున్నా కూడా స్పందించకపోవడంతో అందరూ ఆశచర్యపోతున్నారు.ఇలా నాగబాబు స్పందించకపోవడంతో నిహారిక గురించి వచ్చే వార్తలు నిజమేనా అందుకే మెగా ఫ్యామిలీ ఈ విషయం పై స్పందించలేదా అని అభిమానులు భావిస్తున్నారు.ఇక మెగాస్టార్ కూతురు శ్రీజ(Sreeja) విషయంలో కూడా మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం విశేషం… మరి ఈ వార్తల పై క్లారిటీ రావాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube