అమెరికాలో( America ) స్టూడెంట్స్‌ను వలలో వేసుకొని రాసలీలలకు పాల్పడే టీచర్ల సంఖ్య పెరుగుతోంది.వీరికి కఠిన శిక్షలు విధిస్తున్నా భయపడడం లేదు.
ఏమీ తెలియని విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు.వీరి బాగోతాలా గురించి చివరికి తల్లిదండ్రులు ( Parents ) తెలుసుకొని షాక్ అవుతున్నారు.
తర్వాత వారిని పోలీసులకు పట్టించి తమ పిల్లలను కాపాడుకోగలుగుతున్నారు.తాజాగా ఒక అమెరికన్ తల్లి తన కొడుకు టీచర్‌తో( Teacher ) రాసలీలలు సాగిస్తున్నాడని తెలుసుకుంది.
ఈ చేదు నిజం తెలుసుకునేందుకు ఆమె లైఫ్360 ( Life360 ) అనే సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఉపయోగించింది.
స్నేహితులు, కుటుంబ సభ్యుల లొకేషన్‌ను( Location ) ట్రాక్ చేసే యాప్ ఇది.దీని ద్వారా కొడుకు రగ్బీ ప్రాక్టీస్‌ను స్కిప్ చేసి టీచర్ వద్దకు వెళ్తున్నాడని ఆమె కనిపెట్టగలిగింది.అతను పార్క్ రోడ్ పార్క్ వద్ద ఉన్నాడని, అక్కడ అతనిని చెక్ చేయడానికి వెళ్లి ఆమె షాకింగ్ దృశ్యాలు చూసింది.
అక్కడ, ఆమె అతని 26 ఏళ్ల సైన్స్ టీచర్, గాబ్రియేలా కార్టయా-న్యూఫెల్డ్‌తో( Gabriela Cartaya-Neufeld ) కలిసి కారులో అసభ్యకర భంగిమలో చూసింది.ఆమె కారు, దాని లైసెన్స్ ప్లేట్ ఫొటోలు తీసి, సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది థాంక్స్ గివింగ్ హాలిడే సందర్భంగా జరిగింది.విద్యార్థితో తగని రొమాంటిక్ సంబంధాన్ని కలిగి ఉన్నందుకు కార్టయా-న్యూఫెల్డ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తల్లి తన కొడుకు, అతని టీచర్ మధ్య ఏదో తప్పు జరుగుతోందని ముందే కొందరి ద్వారా తెలుసుకుంది.తర్వాత ఆమె అనుమానం మరింత పెరిగింది.చివరికి ఆమె అనుమానమే నిజమైంది.కార్టయా-న్యూఫెల్డ్ తన కారులో, అతని తల్లి ఇంట్లో, ఆమె సొంత ఇంట్లో యువకుడితో లైంగిక కార్యకలాపాలకు పాల్పడిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.అరెస్టుకు ముందు పాఠశాల నిర్వాహకులు కూడా పుకార్లపై వారిని ప్రశ్నించారు, అయితే వారు వాటిని ఖండించారు.జిల్లా న్యాయవాది కార్టయా-న్యూఫెల్డ్‌పై ఉపాధ్యాయుడు విద్యార్థితో ఐదు నేరపూరిత లైంగిక చర్యలకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
ఆమె మెక్లెన్‌బర్గ్ కౌంటీలో జైలు శిక్ష విధించారు, కానీ తర్వాత బెయిల్‌పై విడుదలైంది.






