187 క్యాండీలతో గడ్డాన్ని వెరైటీగా అలంకరించిన వ్యక్తి.. వీడియో వైరల్...

ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్( Christmas ) సమీపిస్తోంది, ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు పండుగ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు.కొందరు తమ ఇళ్లను లైట్లు, క్రిస్మస్ ట్రీలతో డెకరేట్ చేస్తున్నారు, మరికొందరు బహుమతుల కోసం షాపింగ్ చేస్తున్నారు.

 Us Man Sticks 187 Candy Canes To His Beard Details, Christmas, Beard, Candy Cane-TeluguStop.com

ఈ క్రమంలోనే, జోయెల్ స్ట్రాస్సర్( Joel Strasser ) అనే అమెరికన్ వ్యక్తి హాలిడే డెకరేషన్‌లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు.అతను ఇటీవల తన గడ్డంలో 187 క్యాండీలను( 187 Candy Canes ) గుచ్చుకున్నాడు.

సాధారణంగా గడ్డంలో 10 క్యాండీలను ఉంచుకోవడమే చాలా కష్టం అలాంటిది దాదాపు 200 క్యాండీలను తన గడ్డంలో ఉంచుకొని ఆశ్చర్యపరిచాడు.

ఈ పని చేసిన మొట్టమొదటి వ్యక్తిగా అతను గిన్నిస్ రికార్డు( Guinness World Record ) కూడా సృష్టించాడు.అతను ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల ముందు ఈ ప్రదర్శన చేశాడు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు.ఈ క్యాండీలు విరిగిపోకుండా అతను తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు.

చాలా కాలంగా ఈ రికార్డును ప్లాన్ చేస్తున్నాడు, క్రిస్మస్ సందర్భంగా ఆ స్టంట్ విజయవంతంగా పూర్తి చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

జోయెల్ స్ట్రాసర్ ఏటా క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక కొత్త బియర్డ్ డెకరేషన్‌తో ఆకట్టుకుంటాడు.గతేడాది తన గెడ్డంపై 710 క్రిస్మస్ బాబుల్స్( 710 Christmas Baubles ) వేసి మరో రికార్డును బద్దలు కొట్టాడు.ఆ పని చేయడానికి అతనికి రెండున్నర గంటలు పట్టింది, వాటిని తొలగించడానికి గంట సమయం పట్టింది.

జోయెల్ స్ట్రాసర్ 2019 నుండి తన గడ్డాన్ని ( Beard ) వెరైటీగా డెకరేట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఇప్పటికే ఈ వ్యక్తి అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిళ్లను సంపాదించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube