187 క్యాండీలతో గడ్డాన్ని వెరైటీగా అలంకరించిన వ్యక్తి.. వీడియో వైరల్…

ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్( Christmas ) సమీపిస్తోంది, ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు పండుగ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు.

కొందరు తమ ఇళ్లను లైట్లు, క్రిస్మస్ ట్రీలతో డెకరేట్ చేస్తున్నారు, మరికొందరు బహుమతుల కోసం షాపింగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే, జోయెల్ స్ట్రాస్సర్( Joel Strasser ) అనే అమెరికన్ వ్యక్తి హాలిడే డెకరేషన్‌లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు.

అతను ఇటీవల తన గడ్డంలో 187 క్యాండీలను( 187 Candy Canes ) గుచ్చుకున్నాడు.

సాధారణంగా గడ్డంలో 10 క్యాండీలను ఉంచుకోవడమే చాలా కష్టం అలాంటిది దాదాపు 200 క్యాండీలను తన గడ్డంలో ఉంచుకొని ఆశ్చర్యపరిచాడు.

"""/" / ఈ పని చేసిన మొట్టమొదటి వ్యక్తిగా అతను గిన్నిస్ రికార్డు( Guinness World Record ) కూడా సృష్టించాడు.

అతను ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల ముందు ఈ ప్రదర్శన చేశాడు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నాడు.

ఈ క్యాండీలు విరిగిపోకుండా అతను తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు.చాలా కాలంగా ఈ రికార్డును ప్లాన్ చేస్తున్నాడు, క్రిస్మస్ సందర్భంగా ఆ స్టంట్ విజయవంతంగా పూర్తి చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

"""/" / జోయెల్ స్ట్రాసర్ ఏటా క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక కొత్త బియర్డ్ డెకరేషన్‌తో ఆకట్టుకుంటాడు.

గతేడాది తన గెడ్డంపై 710 క్రిస్మస్ బాబుల్స్( 710 Christmas Baubles ) వేసి మరో రికార్డును బద్దలు కొట్టాడు.

ఆ పని చేయడానికి అతనికి రెండున్నర గంటలు పట్టింది, వాటిని తొలగించడానికి గంట సమయం పట్టింది.

జోయెల్ స్ట్రాసర్ 2019 నుండి తన గడ్డాన్ని ( Beard ) వెరైటీగా డెకరేట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇప్పటికే ఈ వ్యక్తి అనేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిళ్లను సంపాదించాడు.