బుక్‌పై ఇండియన్ లాంగ్వేజ్ టెక్స్ట్.. హెల్ప్ కోరిన యుఎస్ వ్యక్తి..?

భారతీయులను చాలా తెలివైన వ్యక్తులు అంతేకాదు తేములపై భారతీయులకు ఎంతో నమ్మకం ఉంటుంది దైవభక్తి ఎక్కువ అని చెప్పవచ్చు.

రాకెట్ సైంటిస్టులు అయినా సరే దేవుడు ఉన్నానని నమ్ముతారు.

దేవుడని పూజిస్తారు.వాళ్ళు చదువుకునే పుస్తకాల మీద దేవుళ్ళ పేర్లు రాస్తుంటారు.

సాధారణంగా చాలామంది భారతీయులు ఏదైనా పని ప్రారంభించే ముందు దేవుని నామాన్ని స్మరించడం ఆచారం.ఓ అమెరికన్ వ్యక్తికి( American ) దొరికిన పుస్తకం దీనికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

ఈ అమెరికన్ వ్యక్తి తనకు 50 ఏళ్ల క్రితం ఒక భారతీయ ప్రొఫెసర్( Indian Professor ) గణిత పుస్తకం ఇచ్చారని సోషల్ మీడియాలో తెలిపారు.ఆ పుస్తకం మొదటి పేజీలో తమిళ భాషలో( Tamil Language ) ఒక వాక్యం రాసి ఉంది.

Advertisement

ఇది ఆయన్ని చాలా ఆశ్చర్యపరిచింది.ఆ వాక్యం అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఆయన ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

దీనికి చాలా మంది భారతీయులు సమాధానం ఇచ్చారు.వారందరూ ఆ వాక్యం ఎందుకు ముఖ్యమో విభిన్న విధాలుగా వివరించారు.

ఈ అమెరికన్ వ్యక్తి ఇండియన్ మ్యాథ్స్ టీచర్ ఇచ్చిన గణిత పుస్తకం( Maths Book ) మొదటి పేజీ మీద తమిళ భాషలో రాసి ఉన్న పేజీని ఫోటో తీశారు.దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ వాక్యాన్ని ఇంగ్లీషులో ట్రాన్స్‌లేట్‌ చేసి తెలుపగలరా అని అడిగారు.దీనికి ఒక నెటిజన్ సమాధానం ఇస్తూ, ఆ వాక్యంలో "శ్రీ రామ జయం"( Shri Ramajayam ) అని రాసి ఉందని చెప్పారు.

అంటే, భగవంతుడు శ్రీ రామచంద్రుడు విజయం సాధించినట్లే, మనం కూడా ఏ పని ప్రారంభించే ముందు ఈ వాక్యాన్ని రాసి, ఆయన ఆశీర్వాదంతో విజయం సాధించాలని ప్రార్థిస్తామని వివరించారు.

లోకేష్ ఈ సినిమాలను పూర్తి చేయడానికి ఎంత తక్కువ టైం తీసుకున్నాడో తెలిస్తే !
టెక్సాస్: నీటిలో మునిగిపోతున్న తల్లి.. పోలీసులను అలర్ట్ చేసిన కొడుకు.. చివరికి..?

మరొక వ్యక్తి, ఆ పుస్తకంలో రాసిన భాష తమిళ భాష అని చెప్పారు.ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్( Srinivasa Ramanujan ) కూడా తమిళనాడు నుంచే వచ్చారని తెలిపారు.మరొక వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఏదైనా అధ్యయన పుస్తకాన్ని ప్రారంభించే ముందు దేవుని స్తుతించే వాక్యాలను రాసే ఆచారం ఉందని చెప్పారు.

Advertisement

ఈ ఆచారాన్ని తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నానని కూడా చెప్పారు.మొత్తం మీద అమెరికన్ డౌట్ ని క్లారిఫై చేశారు.ఈ పోస్ట్‌కి 10 లక్షలకు పైగానే వ్యూస్ వచ్చాయి.

తాజా వార్తలు