హెచ్ 1 వీసాలను పెంచండి... గ్రీన్ కార్డ్‌లపై పరిమితి ఎత్తేయండి: యూఎస్ ప్రభుత్వాన్ని కోరిన అక్కడి వ్యాపారవేత్తలు

అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలతో పాటు విదేశీయులు అగ్రరాజ్యంలో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి వెసులుబాటు కల్పించే గ్రీన్ కార్డులపై ఆంక్షల్ని ఎత్తివేస్తూ వస్తున్నారు జో బైడెన్.

అయితే ట్రంప్ అనుసరించిన విధానాల వల్ల అమెరికాలో వృత్తి నిపుణుల కొరత వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో అక్కడి వ్యాపారవేత్తలు రంగంలోకి దిగారు.హెచ్ 1 బీ వీసాల జారీని పెంచాలని.

గ్రీన్‌కార్డులపై పరిమితి (కంట్రీక్యాప్)ని ఎత్తివేయాలని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరల్ ప్రభుత్వాన్ని కోరింది.పరిమిత సంఖ్యలో గ్రీన్ కార్డులు ఇస్తుండటం వల్ల ప్రవాసులు శాశ్వత నివాసం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, దాని వల్ల తమకు ఉద్యోగుల కొరత తీవ్రతరం అవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

అంతేగాక‌ గ్రీన్ కార్డు కంట్రీ క్యాప్‌ కింద కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఇచ్చే హెచ్-1బీ వీసా విధానాన్ని రద్దు చేసి, ఒక్కొక్కరికి ఇచ్చేలా మార్పులు చేయాలని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్య‌ర్థించింది.ఈ విధానం వ‌ల్ల‌ ప్రస్తుతం వున్న 65 వేల‌ వీసాల జారీని రెట్టింపు చేసే వీలు క‌లుగుతుంద‌ని తెలిపింది.

Advertisement

అమెరికాలో నైపుణ్య ఉద్యోగుల కొర‌త‌ను తీర్చాలంటే హెచ్-1బీ, హెచ్‌-2బీ వీసాల జారీని రెట్టింపు చేయ‌డ‌మే పరిష్కారమని యూఎస్ ఛాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ పేర్కొంది.అలాగే ఏళ్ల నాటి ఇమిగ్రేషన్ చట్టాల్లో కూడా మార్పులు చేయాల‌ని సూచించింది.

ఈ నెల ప్రారంభంలో కొందరు అమెరికా చట్టసభ్యులు కూడా ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌కు సంబంధించి వివిధ దేశాలపై వున్న పరిమితి (కంట్రీ క్యాప్)ని తొలగించాలని యుఎస్ ప్రతినిధుల సభలో బిల్లుని ప్రవేశపెట్టారు.కాంగ్రెస్ మహిళ జో లోఫ్గ్రెన్, కాంగ్రెస్ సభ్యుడు జాన్ కర్టిస్ ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.

దీనివల్ల దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షిస్తున్న భారతీయ ఐటి నిపుణులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.లీగల్ ఎంప్లాయ్‌మెంట్ (ఈగల్) చట్టం, 2021 ప్రకారం గ్రీన్ కార్డులను సమానంగా జారీ చేసేందుకు గాను సెనేట్ ఆమోదించాలి.

అనంతరం ఇది అధ్యక్షుడి ఆమోదముద్ర తర్వాత చట్టంగా మారుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఉపాధి ఆధారిత వలస వీసాలపై దేశానికి ఏడు శాతంగా వున్న పరిమితిని దశలవారీగా ఎత్తివేయాలని ఈ బిల్లులో ప్రస్తావించారు.అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలపై ఇప్పటి వరకు వున్న ఏడు శాతం పరిమితిని 15 శాతానికి పెంచాలని సూచించింది.ఈ విధానంలో తక్కువ జనాభా వున్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా.

Advertisement

భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు ఏడు శాతం నిబంధన ప్రకారం కేటాయించే గ్రీన్‌కార్డులు ఏ మూలకు సరిపోవడం లేదు.కాగా, ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.

వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

తాజా వార్తలు