తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్, ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌతేలా( Urvashi rautela ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పలు ఐటమ్ సాంగ్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.
మామూలుగా ఐటమ్ సాంగ్స్( Item Songs ) చేసే హీరోయిన్స్, హీరోయిన్ గా అవకాశాలు వస్తే మాత్రం అస్సలు వదులుకోరు.హీరోయిన్ గా అవకాశాలు రాక ఐటమ్ గర్ల్ గా మారిన హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు.
కానీ హీరోయిన్ ఊర్వశి రౌతేలా మాత్రం హీరోయిన్ ఛాన్సులు వద్దు, ఐటెంసాంగ్స్ ముద్దు అంటోంది.
తాజా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఊర్వశికి హీరోయిన్ ఛాన్సులు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు కొంతమంది మూవీ మేకర్స్.అయితే ఆశ్చర్యకరంగా అలాంటి అవకాశాల్ని ఆమె తిప్పికొడుతోంది.ఈ విషయంలో ఆమె ఈక్వేషన్స్ ఆమెకున్నాయి.
ఒక చిన్న బ్యానర్ లో, చిన్న హీరో సరనస హీరోయిన్ గా నటించే కంటే ఓ పెద్ద బ్యానర్ లో బడా హీరోతో ఐటెంసాంగ్ చేయడం బెటర్ అని భావిస్తోంది ఊర్వశి( Urvashi rautela ).అంతేకాకుండా ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది.హీరోయిన్ వేషాలకు కక్కుర్తిపడి ఏదైనా సినిమా చేసి, ఆ తర్వాత అది కాస్తా ఫ్లాప్ అయితే ఐటెం భామగా తెచ్చుకున్న క్రేజ్ కూడా పోతుందని భయపడుతోంది ఊర్వశి.
అందుకే సినిమా అవకాశాలు వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరిస్తోంది.అంతేకాదు, అలాంటి ఫ్లాప్ తర్వాత తనకు ఇక ఐటెంసాంగ్ అవకాశాలు కూడా రావనే టెన్షన్ ఈ ముద్దుగుమ్మకు ఉంది.ఒక విధంగా చూసుకుంటే, ఈమె ఆలోచన విధానం సరైందనే చెప్పాలి.
ఐటెం భామగానైనా, హీరోయిన్ గా అయినా కెరీర్ స్పాన్ చాలా తక్కువ.అయితే ఈ విషయంలో ఆమె క్లారిటీలు ఆమెకు ఉన్నప్పటికీ అభిమానులు నేటిజన్స్ మాత్రం కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు హీరోయిన్గా చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తుండగా మరికొందరు ఆమెకి ఆమె ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.