సమంత తో పోల్చుకున్న ఉర్ఫీ.. ఆమె చేస్తే తప్పు కాదు.. నేను చేస్తే తప్పా?

ఉర్ఫీ జావేద్. ఈమె పేరు తెలియని యూత్ లేరంటే అతియసోక్తి కాదేమో.

సోషల్ మీడియా చూసే వారికీ ఈమె గురించి బాగా తెలుసు.తక్కువ సమయంలోనే ఉర్ఫీ తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కుంది.

ఈమె తన డ్రెసింగ్ స్టైల్ తో వెరైటీ డ్రెస్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తన స్పెషల్ డ్రెస్సింగ్ స్టయిల్ తోనే ప్రతి ఒక్కరిని ఆకట్టు కుంటూ అందచందాలను ఆరబోస్తుంది.

కొత్త కొత్త ఫ్యాషన్ ను ట్రై చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.అయితే ఒక్కోసారి ఈ అమ్మడు హద్దులు దాటి మరీ అందాలను ఆరబోస్తుంది.

Advertisement

కొంత వరకు అందాలు ఆరబోస్తే ఎవ్వరైనా ఆస్వాదిస్తారు.కానీ లిమిట్స్ దాటితేనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

ఈమె వెరైటీ డ్రెస్ లను వేసుకుని విసుగు తెప్పిస్తుంది.పిన్నీసులతో, రబ్బర్ బ్యాండ్ లతో డ్రెస్ లను వేసుకుంటూ అదే ఫ్యాషన్ అంటూ చెప్పుకుంటుంది.

దీంతో ఈమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ఇటీవలే దోమ తెర లాంటి డ్రెస్ వేసుకుని తెగ అందాలను ఒలక పోసింది.

ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఇన్నర్ అందాలను ఆరబోసి చాలా మందితో విమర్శలు గుప్పించుకునేలా చేసింది.ఈమె డ్రెస్ నచ్చని చాలా మంది ఆమెను ట్రోలింగ్ చేసారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఈ విషయంపై ఈమె తాజాగా స్పందించింది.ఆమె సౌత్ స్టార్ హీరోయిన్ తో పోల్చుకుంటూ సమర్ధించుకుంది.

Advertisement

సమంత ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో హాట్ గా ఉంది.అలాంటి డ్రెస్ లోనే ఉర్ఫీ దరిద్రంగా ఉంది అనే రెండు వార్తలను కంపేర్ చేస్తూ నెటిజెన్స్ కు ఒక ప్రశ్న వేసింది.ఇలాంటి డ్రెస్ వేసుకుంటేనే సూపర్, హాట్ అంటూ పొగిడిన నేను అలాంటి డ్రెస్ వేసుకుంటే మాత్రం తప్పు, దరిద్రం అంటూ తిడుతున్నారు.

ఆమె వేసుకుంటే తప్పుకాదు? నేను వేసుకుంటే తప్పా? సమంత అంటే నాకూ ఇష్టమే.నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్ లైన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావేద్.

అందుకు నెటిజెన్స్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.నువ్వు ఎప్పుడు అలాంటి డ్రెస్ లను వేసుకుని ఫోటో షూట్స్ చేస్తున్నావు.

అప్పుడప్ప్పుడు కాదు కదా.ఇద్దరికీ తేడా లేదా.అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు