అమ్మ కోరిక తీర్చాలని సివిల్స్ సాధించాడు.. నాగ భరత్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) సాధించిన ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది.

తాజాగా సివిల్స్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా ఈ ఫలితాలలో ఉమ్మడి కడప జిల్లాకు( Kadapa District ) చెందిన వ్యక్తి సత్తా చాటాడు.

ఆ వ్యక్తి పేరు మర్రిపాటి నాగభరత్( Marripati Naga Bharath ) కాగా ఇతని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.చదువు పూర్తైన తర్వాత సాఫ్ట్ వేర్ జాబ్ సాధించిన నాగ భరత్ తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగారు.15 లక్షల రూపాయల వేతనాన్ని వదులుకొని మరీ యూపీఎస్సీపై దృష్టి పెట్టిన నాగ భరత్ ఖరగ్ పూర్ ఐఐటీలో( Kharagpur IIT ) బీటెక్ పూర్తి చేయడంతో పాటు అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేశాడు.ఢిల్లీలోని వాజీరావు కోచింగ్ సెంటర్ లో సంవత్సరం పాటు ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న నాగ భరత్ ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి బాలలత మేడమ్ గైడెన్స్ ద్వారా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు.

సివిల్స్ పరీక్షలో మొదట ఆశించిన ఫలితాలు రాకపోయినా నాగభరత్ మాత్రం వెనుకడుగు వేయలేదు.ఎంటెక్ చదివిన నాగభరత్ తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాలలో 580వ ర్యాంక్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.ఈ ర్యాంక్ తో ఐపీఎస్( IPS ) వస్తుందని భవిష్యత్తులో ఐఏఎస్ సాధిస్తానని నాగభరత్ చెబుతున్నారు.

నాగభరత్ టాలెంట్ తో భవిష్యత్తులో ఐఏఎస్ అవుతారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తల్లి కోరిక మేరకు బాల్యం నుంచి కలెక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్న నాగభరత్ ఐఏఎస్ గా ఎంపికై పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.రైతుల కష్టాలు తీర్చడానికి తన వంతు ప్రయత్నిస్తానని నాగభరత్ అన్నారు.సివిల్స్ ర్యాంకర్ నాగభరత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు