8 గంటలు జాబ్ చేస్తూ సివిల్స్ లో 239వ ర్యాంక్.. పవన్ కుమార్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

సివిల్స్ పరీక్షలో పాసై ఉద్యోగం సాధించడం తెలిక కాదు.ఒకవైపు 8 గంటల జాబ్ చేస్తూ మరోవైపు సివిల్స్ ( Civils ) సాధించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Civils Ranker Pawan Kumar Inspirational Success Story Details, Pawan Kumar, Civi-TeluguStop.com

మూడో ప్రయత్నంలో సివిల్స్ పరీక్ష పాసై 239వ ర్యాంక్ సాధించిన పవన్ కుమార్( Pawan Kumar ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఉద్యోగం చేస్తూ మంచి ర్యాంక్ సాధించిన పవన్ కుమార్ సక్సెస్ స్టోరీ నెటిజన్లకు స్పూర్తిగా నిలుస్తోంది.

నిరుపేద కుటుంబంలో జన్మించిన పవన్ కుమార్ కు బాల్యం నుంచి ఎదురైన ఆటంకాలు అన్నీఇన్నీ కావు.తినడానికి సరైన తిండి లేక ఆకలి బాధతో ఇబ్బందులు పడిన రోజులు సైతం పవన్ కుమార్ జీవితంలో ఉన్నాయి.

ఒకానొక సమయంలో పవన్ ఇంటర్ తోనే తన చదువుకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడగా పవన్ కుమార్ మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాలను సాధించే విషయంలో వెనుకడుగు వేయలేదు.

Telugu Civilsranker, Pawan Kumar-Inspirational Storys

పవన్ కుమార్ తండ్రి రైతు( Farmer ) కాగా ఇతనికి మంచి ర్యాంక్ రావడం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.చదువుకుంటే మాత్రమే తమ జీవితాలు మారతాయని భావించిన పవన్ కుమార్ యూపీలోని రఘునాథ్ పూర్ గ్రామంలో( Raghunathpur Village ) జన్మించారు.ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత కూడా తనపై ఉండటంతో పవన్ కుమార్ లక్ష్య సాధన కోసం మరింత తీవ్రంగా శ్రమించారని తెలుస్తోంది.

Telugu Civilsranker, Pawan Kumar-Inspirational Storys

అలహాబాద్ లో బీఏ పూర్తి చేసిన తర్వాత పవన్ కుమార్ సివిల్స్ పై దృష్టి పెట్టారు.తల్లి బంగారం అమ్మి సివిల్స్ కు ప్రిపేర్ అయిన పవన్ ఒకానొక సమయంలో తన దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.తప్పనిసరి పరిస్థితులలో నేను పార్ట్ టైమ్ జాబ్ చేశానని ఆయన పేర్కొన్నారు.రెండుసార్లు సివిల్స్ లో ఫెయిలైనా మూడో ప్రయత్నంలో ఆశించిన ఫలితాలు దక్కాయని పవన్ కుమార్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube