తమిళ అర్జున్‌ రెడ్డి ఈసారి కూడా బాగా రాలేదా?

తెలుగులో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగు అర్జున్‌ రెడ్డిని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేశారు.

 Update Of Tamil Arjun Reddy Movie-TeluguStop.com

ఇటీవలే విడుదలైన ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుని అక్కడ ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేసింది.లాంగ్‌ రన్‌లో 250 కోట్ల వరకు రాబడుతుందనే నమ్మకంతో ఉన్నారు.50 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన కబీర్‌ సింగ్‌ అక్కడ సెన్షేషన్‌ ను క్రియేట్‌ చేస్తుంది.

తమిళ అర్జున్‌ రెడ్డి ఈసారి కూ

ఇక అర్జున్‌ రెడ్డిని తమిళంలో కూడా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.విక్రమ్‌ తనయు దృవ్‌ హీరోగా ‘వర్మ’ అంటూ మొదట మొదలు పెట్టారు.బాలా దర్శకత్వం వహించగా ఆ సినిమా పూర్తి అయిందనుకున్న సమయంలో సినిమాను మొత్తం తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు.

రషెష్‌ ఏమాత్రం సరిగ రాలేదని మళ్లీ రీషూట్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.డబ్బులు ఖర్చు అయినా కూడా మళ్లీ సినిమాను తీయాలని భావించారు.

తమిళ అర్జున్‌ రెడ్డి ఈసారి కూ

ఈసారి అర్జున్‌ రెడ్డికి సహాయ దర్శకుడిగా పని చేసిన గిరీశయ్యను తీసుకున్నారు.టైటిల్‌ కూడా వర్మ కాకుండా ఆధిత్య వర్మ అంటూ పెట్టారు.ఆధిత్య వర్మ టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు.వర్మకు వచ్చినట్లుగానే ఆధిత్య వర్మకు కూడా నెగటివ్‌ టాక్‌ వచ్చింది.దాంతో సినిమాను మళ్లీ పక్కకు పెట్టేయాలని నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.జూన్‌లో సినిమా విడుదల అనుకున్నారు.

జులై వచ్చింది.అయినా ఇంకా సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ లేదు.

దాంతో ఆధిత్య వర్మ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube