Ram Charan Upasana: రామ్ చరణ్ కు విడాకులివ్వాలనుకున్న ఉపాసన.. వారి మధ్య అన్ని విభేదాలు వచ్చాయా?

Upasana Wanted To Divorce Ram Charan Here Is The Reason Why

ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా భార్య భర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి.ఇక వాటిని కూర్చొని సరిదిద్దుకోకుండా ఏకంగా విడాకుల వరకు తీసుకెళ్తున్నారు.

 Upasana Wanted To Divorce Ram Charan Here Is The Reason Why-TeluguStop.com

ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా మారుస్తూ విడాకులు తీసుకుంటున్నారు.ఇప్పటికే చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాలకే గొడవ పడి విడాకులు ( Divorce ) తీసుకున్నారు.

అయితే రామ్ చరణ్ కు ( Ram Charan ) కూడా ఉపాసన ( Upasana ) విడాకులు ఇవ్వాలని అనుకుందట.ఇంతకు అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగా వారసుడుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో.మెగా కోడలుగా ఉపాసన టాలీవుడ్ ఇండస్ట్రీలో అంత గౌరవం పెంచుకుంది.మెగావారికి తగ్గట్టుగా దొరికిన ఈ కోడలిపిల్లకు తెలుగు ప్రేక్షకులు మంచి అభిమానం చూపిస్తూ ఉంటారు.ఇక ఉపాసన కూడా మెగా వారి కోడలని, స్టార్ హీరో భార్యని అని హోదా లాంటిది చూపించకుండా తను ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది.

Telugu Kajal Aggarwal, Law, Ram Charan, Ramcharan, Tollywood, Upasana-Movie

ఏ రోజు కూడా ఆమెలో గర్వం అనేది కనిపించలేదు.అంతేకాకుండా అపోలో వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నప్పటికీ కూడా ఆమె మాత్రం మామూలు వ్యక్తిలా ప్రవర్తిస్తుంది.అందుకే మెగా అభిమానులు తనను వదినగా ఆరాధిస్తూ ఉంటారు.తనకు మంచి గౌరవం ఇస్తూ ఉంటారు.ఇక ఉపాసన, రామ్ చరణ్ కొంతకాలం ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.

తమ పెళ్లి సమయంలో ఉపాసనను చాలామంది బాగా ట్రోల్ చేశారు.

కానీ కొంతకాలం తర్వాత ఉపాసన క్యారెక్టర్, ఆమె మంచితనం తెలియడంతో.ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఒక మనిషిలో చూడాల్సింది అందం కాదని.

ఆ మనిషి వ్యక్తిత్వమని అనుకున్నారు.చూడ్డానికి మామూలుగా ఉన్నా కూడా ఉపాసన వ్యక్తిగతంగా చాలా మంచిదని చెప్పాలి.

Telugu Kajal Aggarwal, Law, Ram Charan, Ramcharan, Tollywood, Upasana-Movie

ఇక పెళ్లయి పదేళ్లకు ఉపాసన ప్రెగ్నెంట్ తో శుభవార్త అందించింది.ప్రస్తుతం ఆమెకు ఏడవ నెల నడుస్తుంది.అయితే ఈ సమయంలో ఉపాసన, రామ్ చరణ్ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే గతంలో ఉపాసన రామ్ చరణ్ కు విడాకులు ఇవ్వాలని అనుకుందట.

నిజానికి ఉపాసన, రామ్ చరణ్ చాలా అన్యోన్యంగా ఉంటారు.ఏ రోజు కూడా వారి మధ్య విభేదాలు రాలేవు.

Telugu Kajal Aggarwal, Law, Ram Charan, Ramcharan, Tollywood, Upasana-Movie

బయట కూడా ఒకరిపై ఒకరు బాగా ప్రేమలు చూపించుకుంటారు.అయితే అటువంటి జంట మధ్య విభేదాలు వచ్చాయని తెలిసింది.దానికి కారణం హీరోయిన్ కాజల్( Kajal ) అని తెలిసింది.రామ్ చరణ్ కాజల్ తో నటించి మంచి సక్సెస్ లు అందుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరిద్దరూ కలిసి నటించిన సమయంలో వీరి మధ్య లవ్ ఏర్పడిందని తెలిసింది.

అయితే పెళ్లి తర్వాత కూడా రామ్ చరణ్ కాజల్ తో క్లోజ్ గా ఉండటంతో ఉపాసనకు నచ్చలేదని దీంతో ఉపాసన రామ్ చరణ్ కు విడాకులు ఇవ్వాలని అనుకుందట.

అయితే చిరంజీవి వీరి మధ్య వచ్చిన మనస్పర్దాలను సరిదిద్ది మరోసారి వీరిద్దరిని ఒకటి చేశారని తెలిసింది.ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లపై ఇటువంటి రావడం మాత్రం కామన్ అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube